Pawan Kalyan’s Health: పవన్ అనారోగ్యంపై చంద్రబాబు ట్వీట్..! ఓజీని గుర్తుచేస్తూ..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. తాను నటించిన తాజా చిత్రం ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత వైరల్ ఫీవర్ కు గురైన పవన్ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకూ అలాగే హాజరయ్యారు. అలాగే అధికారిక సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో జ్వరం మరింత పెరిగింది. దగ్గు కూడా తోడైంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా పరిస్ధితిలో మార్పు లేకపోవడంతో డాక్టర్ల సూచనతో ఇవాళ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై ఎక్స్ లో పెట్టిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు రీట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా మరియు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం కొనసాగించడానికి మరియు విస్తృత ప్రశంసలు పొందుతున్న ఓజీ విజయాన్ని ఆస్వాదించడానికి ఆయన మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Pawan Kalyan s Health Chandrababu Naidu Extends Speedy Recovery Wishes on X

ఇప్పటికే అనారోగ్యం కారణంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. పవన్ కు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ మాత్రం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్ల సూచన మేరకు పవన్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్లు జనసేన ఇవాళ ట్వీట్ లో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+