బీజేపీ ఇవ్వలేనిది కోరిన పవన్ ? దానిపైనే చంద్రబాబు ఆశలూ ! జగన్ కు కావాల్సింది అదే !

ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లు గడువున్నా రాజకీయాలు ఇప్పటినుంచే వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన మిత్రపక్షం బీజేపీ ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ తో బీజేపీని పూర్తిగా ఇరుకునపెట్టేశారు కూడా. దీనిపై బీజేపీ ఇచ్చే క్లారిటీ కోసం పవన్ మాత్రమే కాదు చంద్రబాబు, జగన్ కూడా ఎదురుచూస్తున్నారు.

 బీజేపీని పవన్ కోరిందిదే

బీజేపీని పవన్ కోరిందిదే

ఏపీలో జనసేన మిత్రపక్షం బీజేపీని జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఓ విషయంలో క్లారిటీ కోరారు. అది బీజేపీ రోడ్ మ్యాప్. అంటే 2024 ఎన్నికలకు మీ రోడ్ మ్యాప్ ఏంటి ? బీజేపీ ఎవరితో కలిసి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లబోతోంది. ? దానిపై ఇప్పుడే ఓ క్లారిటీ ఇచ్చేస్తే భవిష్యత్ వ్యూహాలు రచించడం సులువవుతుందనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. దీంతో బీజేపీ నేతలు ఇచ్చే క్లారిటీ కోసం జనసేనాని ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ క్లారిటీ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పట్లోతేలేలా లేదు.

 చంద్రబాబు ఎదురుచూపులు

చంద్రబాబు ఎదురుచూపులు

బీజేపీ భవిష్యత్ ప్రణాళికపై పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ కాషాయ పార్టీ ఇస్తుందో లేదో తెలియదు కానీ... దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు బీజేపీని వదిలిపెట్టడమే కాకుండా ఆ పార్టీపై ధర్మపోరాటం చేసిన చంద్రబాబు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాత్రం బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరి పోరుతో లాభం లేదని గుర్తించారు. దీంతో బీజేపీ అగ్రనేతల్ని కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీతో ఇప్పుడే పొత్తు ఇష్టం లేని బీజేపీ అగ్రనేతలు.. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు పవన్ కు బీజేపీ క్లారిటీ ఇచ్చేస్తే దాని ఆధారంగా తాను పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

 జగన్ కూడా వెయిటింగ్ ?

జగన్ కూడా వెయిటింగ్ ?

2019 తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అనధికార అవగాహన ప్రారంభించిన వైఎస్ జగన్ కు అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. మరోవైపు సీబీఐ కేసులు తరుముకొస్తున్నాయి. ఓవైపు తనపై సీబీఐ కేసులతో పాటు బాబాయ్ వివేకా హత్య కేసులోనూసీబీఐ వైసీపీ నేతల్ని తరుముతోంది. దీంతో కేంద్రంతో సఖ్యత కొనసాగించాల్సిన పరిస్ధితి. కానీ ఇప్పుడు పవన్ కోరినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ప్రకటిస్తే ఎన్నికల నాటికి తాను ఏం చేయాలనే దానిపై జగన్ సొంత వ్యూహాలు రచించుకునే వీలుంటుంది. అలా కాకుండా బీజేపీ అధిష్టానం గుంభనంగా ఉండిపోతే మాత్రం జగన్ కు ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

 కుడి ఎడమైతే మాత్రం ?

కుడి ఎడమైతే మాత్రం ?

ఒకవేళ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లుగా బీజేపీ 2024 ఎన్నికలపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తే మాత్రం అది కచ్చితంగా పవన్ తో పాటు చంద్రబాబు, జగన్ లకు తమ భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఉపయోగపడుతంది. అంతే కాదు ఒక వేళ చంద్రబాబుతో కలిసి ముందుకెళ్తామని బీజేపీ ఇప్పుడే ప్రకటిస్తే కచ్చితంగా 2014 నాటికి పరిస్ధితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అలా కాదని తాము జగన్ తో కలిసి ముందుకు సాగుతామని చెప్పేస్తే మాత్రం పవన్ వారితో విడిపోయి చంద్రబాబుతో కలిసి వీరిద్దరిపై పోరాటం చేసేందుకు వీలు కలుగుతుంది. ఇవేవీ చెప్పకుండా బీజేపీ మౌనంగా ఉండిపోతే మాత్రం కచ్చితంగా జగన్, పవన్, చంద్రబాబుకు ఎన్నికల వరకూ ఈ టెన్షన్ తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+