Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: భీమవరం నియోజకవర్గ నేతలతో భేటీ వాయిదా!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్ర సాగిస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త అస్వస్థతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీని గద్దె దించడం కోసం వారాహి యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ యాత్రలో భాగంగా జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కోన సీమ జిల్లాల్లో జోరుగా వారాహి యాత్రను కొనసాగిస్తున్న పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. నరసాపురంలో వారాహి యాత్రను సాగించిన పవన్ కళ్యాణ్ నేడు స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు.ఈ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పెదఅమిరం లోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్ లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్షలో ఉండడంతో నీరసించి పోయి స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అనారోగ్యం కారణంగా ఉదయం 11 గంటలకు నిర్వహించవలసిన భీమవరం నియోజకవర్గం నేతల సమావేశాన్ని వాయిదా వేశారు. ఇక ఈ సమావేశాన్ని మధ్యాహ్నం తర్వాత నిర్వహించనున్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు నేడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

Pawan Kalyan

ఇదిలా ఉంటే అసలు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గం నేతలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు.

పవన్ కళ్యాణ్ అస్వస్థత నేపథ్యంలో జనసైనికులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పవన్ కళ్యాన్ తన యాత్రను తిరిగి కొనసాగిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. కాగా ఏపీ ప్రజలను వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పదేపదే కోరుతున్నారు పవన్ కళ్యాణ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+