పవన్ నోట సోషల్ ఇంజనీరింగ్ మాట ! వైసీపీ, టీడీపీ పరిస్దితి బావుందంటూ..

ఏపీలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో ఇతర పార్టీలకూ, తమ పార్టీకి ఉన్న వ్యత్యాసం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన నేతల్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో వైసీపీ, టీడీపీతో జనసేనను పోల్చారు.

జనసేన నేతలు బలంగా మారాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామని వారికి సూచించారు. ఇంట్లో కూర్చుని గెలిచేయాలి.. అధికారం వచ్చేయాలంటే కుదరదన్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులుగా మీరు మరింత మందిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా? అని ప్రశ్నించారు.

pawankalyan

జనసేన పార్టీ ఉన్నతి కోసం బలంగా కష్టపడాలని నేతలకు పవన్ సూచించారు. పార్టీ నేతల్లో సమన్వయం అనేది ప్రధానమని పవన్ స్పష్టం చేశారు. నిజాయతీని నమ్ముకున్న పార్టీ తమదని వారికి గుర్తుచేశారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు, సమస్యలపైనా పవన్ వారితో చర్చించారు. కులాలు , వర్గాలను దాటి రాజకీయం చేయాలని పవన్ నేతలకు సూచించారు. ఒక కులానికి ఒక పార్టీ అన్న పద్దతి ఉండకూడదన్నారు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని నేతలకు పవన్ సూచించారు.

నాయకత్వమంతా ఒకే తరహా ఆలోచనలో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా కులాలన్నీ కలసికట్టుగా నడవాలన్నదే తన ఆలోచన అన్నారు. తాను విలువలు చెప్పనని, వాటిని పాటించే వ్యక్తినని పవన్ గుర్తుచేశారు. కొత్తతరం నాయకుల్ని తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలకు ఇన్ స్టెంట్ గా అనుభవం ఉన్న నాయకులు దొరికేశారని, వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పవన్ గుర్తుచేశారు. ప్రతికూల పరిస్థితుల మధ్య జనసేన నేతలు ఎదురెళ్తున్నారని పవన్ తెలిపారు. జనసేన నాయకులు ముందుగా నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకోవాలని పవన్ ఆదేశించారు. పని చేసుకుంటూ ముందుకు వెళ్లండన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+