పేర్ని, ప్రసన్నవి జగన్ మనసులో మాటలే..! దేవినేని ఉమ కామెంట్స్..!
ఏపీలో వైఎస్ జగన్ పేరు చెబితేనే మండిపడే టీడీపీ నేతల జాబితాలో దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. ఆయన మరోసారి ఇవాళ వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు పేర్ని నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు. పేర్ని, ప్రసన్న మాటలు జగన్ మనసులోనివే అంటూ దేవినేని విమర్శించారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, అలాగే పేర్నినాని తాజాగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఇప్పుడు ఇబ్బందిపెడుతున్న టీడీపీ నేతలపై తాము అధికారంలోకి వచ్చాక రప్పా రప్పా అంటూ సైలెంట్ గా వేసెయ్యాలంటూ చేశారని చెబుతున్న వ్యాఖ్యల్ని దేవినేని ఉమ ఖండించారు. సోదరి వరసయ్యే మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని జగన్ ఖండించకుండా సమర్థించారని దేవినేని ఆరోపించారు. జగన్ అంతరంగంలో ఉన్న మాటలే కదా పేర్నినాని, ప్రసన్నకుమార్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయని విమర్శించారు.

పేర్ని నానిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దేవినేని కోరారు. మరోవైపు విజయసాయిరెడ్డి ఇవాళ చేసిన కర్మఫలం ట్వీట్ పైనా దేవినేని స్పందించారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య గొంతుకోసినందుకే కదా ఇవాళ ఈ దుస్దితి పట్టిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బోంబే స్టాక్ ఎక్చేంజ్, ప్రధాని కార్యాలయానికి లేఖలు రాసి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారని, అయినా చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని దేవినేని గుర్తుచేశారు.

-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications