తండ్రి పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న చంద్రబాబు జగన్ పై తప్పుడు మాటలా?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని మరోమారు విరుచుకుపడ్డారు. గత 40 సంవత్సరాల లో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారని పేర్ని నాని మండిపడ్డారు.

కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయాలలో చంద్రబాబు ఉండడం అనవసరమని వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని, ఈరోజుకి చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడిని అని చెప్పుకుంటున్నాడు అని చంద్రబాబు పై మండిపడ్డారు.

Perni Nani serious on Chandrababu comments on ys jagan

80 ఏళ్ళ వయసులో కూడా రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబుకు ఏళ్ళు వచ్చి ఏమి లాభం అంటూ మండిపడిన పేర్ని నాని తాటి చెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసు వస్తుందని కానీ ఏం ప్రయోజనం అంటూ ఎద్దేవా చేశారు. తల్లి, తండ్రి చనిపోతే కొరివి పెట్టలేని వాడు చంద్రబాబు అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

నేను ఫలానా వాళ్ళ కొడుకుని అని చెప్పుకోలేని వాడు కూడా తప్పుడుమాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని చంద్రబాబును టార్గెట్ చేశారు. తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం చెప్పుకుంటారని పేర్ని నాని తెలిపారు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని, అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా నేల నాకిస్తాడో అందరికీ తెలుసని మాజీమంత్రి పేర్ని నాని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా వైఎస్ఆర్సిపి జెండాను కూడా టచ్ చేయలేడని పేర్ని నాని పేర్కొన్నారు. 80 ఏళ్ల ముసలి నక్క బాబు వయసుకు తగిన మాటలు మాట్లాడితే బాగుంటుందని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసని వాళ్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+