ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా ? ఏంటా బెదిరింపులు ? పవన్ పై పేర్ని ఫైర్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు విడుదల నేపథ్యంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నిర్మాతలతో సమస్యల నేపథ్యంలో చర్చలకు రాకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేసిన హెచ్చరికపై సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించి విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ టాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ హెచ్చరికలపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఘాటుగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని పేర్ని నాని మండిపడ్డారు. అప్పుడు ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారని పవన్ ను ప్రశ్నించారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని, ఇవి దివాలాకోరు రాజకీయాలు కావా అని పేర్ని అడిగారు. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా? అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

perni nani slams pawan kalyan for threatening Tollywood says no need it for upcoming flop movie

రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా అని పవన్ కళ్యాణ్ ను పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సినిమా వాళ్ళను బెదిరించటానికి మీరు ఎవరని పవన్ ను పేర్ని అడిగారు.
అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలుసా మీకు అన్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు తక్కువ రేట్లకు సినిమా చూపించాలన్న ఉద్దేశంతో, నిర్మాతలు, హీరోలు ఇష్టారాజ్యంగా ప్రజల్ని లూటీ చేయకూడదని ఓ జీవో తెస్తే ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు నోటికొచ్చినట్లు తిట్టారని పేర్ని గుర్తుచేశారు.

perni nani slams pawan kalyan for threatening Tollywood says no need it for upcoming flop movie
మా డబ్బులతో సినిమా తీసి, మా ఇష్టం వచ్చిన రేటుకు సినిమా చూపిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారని పేర్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్.. థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేస్తారని చెప్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని విచారణకు ఆదేశించారన్నారు. ఇది ద్వంద్వ విధానం కాదా అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో వారికి వారిలో తగవు నడుస్తుంటే సినిమా వాయిదా వేసుకోవాలి కానీ, బెదిరిస్తూ విచారణలకు ఆదేశించడం దివాలాకోరుతనం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+