Pics: చంద్రబాబు, జగన్ దీపావళి సంబరాలు చూశారా ? ఈసారి స్పెషల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఇద్దరు రాజకీయ నేతలు సీఎం చంద్రబాబు, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇద్దరూ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా, వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వీరిద్దరూ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా మాత్రం కాస్త ఆహ్లాదంగా కనిపించారు. అదీ కుటుంబ సభ్యులతో కలిసి వారు వేడుకలు జరుపుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసంలో భార్య నారా భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యేకంగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తున్న ఫొటోల్ని టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు, భువనేశ్వరి పక్క పక్కనే నిలబడి కాకర పూవొత్తుల్ని వెలిగిస్తూ కనిపిస్తున్నారు. నిత్యం రాజకీయాల బిజీలో ఉండే చంద్రబాబు.. ఇలా భార్య భువనేశ్వరితో కలిసి విడిగా దీపావళి వేడుకల్లో పాల్గొనడం పార్టీ అభిమానులు, కార్యకర్తలకు సంతోషానిస్తోంది.

#HappyDiwali
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2025
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు. ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లి… pic.twitter.com/JuJXy0jIVf
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంకలో ఉన్న నివాసంలో ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇవాళ ఉదయమే లండన్ నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన జగన్.. దీపావళి వేడుకల్లో భార్య వైఎస్ భారతితో కలిసి పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా భారీగా అలంకరించిన యలహంక నివాసంలో వైఎస్ జగన్, భారతి మాత్రమే విడిగా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. బాణాసంచా కాలుస్తూ దట్టంగా అలుముకున్న పొగ మధ్యలో జగన్, భారతి కనిపిస్తుండటం అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దీపావళి సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రతీ చోటా దీపావళి బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు కూడా దీపావళి సంబరాల్లో మునిగిపోయారు. ఏడాది పొడవునా ఎంత బిజీగా ఉన్నా ఉత్తరాది వ్యాపారులు అయితే దీపావళి పండుగను మాత్రం కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతీ నగరం, పట్ఠణం, గ్రామాల్లో సైతం వేడుకలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications