రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు: ప్రధాని మోడీ, అమిత్‌షా, సీఎం జగన్ విషెస్!!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఈరోజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షును పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివేకం, గౌరవంతో పాటు ప్రజల సంక్షేమం కోసం నిబద్ధత కలిగిన నాయకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షించారు. దేశ పురోభివృద్ధికి ఆమె చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయని, ద్రౌపది ముర్ము అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

 jaganmurumu

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ద్రౌపది ముర్ము కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడానికి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం పట్ల అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ మీరు సాగిస్తున్న ప్రయాణం స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రజా సేవలో, పాలనలో మీ అనుభవం వల్ల దేశానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో మీరు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ద్రౌపది ముర్ము పుట్టిన రోజు సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సాధికారత ఒక బలమైన సంతకం గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని యోగీ ఆదిత్య నాథ్ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం ఆ జగన్నాథుని ప్రార్థిస్తున్నట్లు గా ట్వీట్ చేశారు.

ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంచి ఆరోగ్యంతో పాటు ఆనందం తో జీవించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. యావత్ జాతికి ఆమె స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+