దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

నేడే విడుదల...ఎపి ఫైబర్ గ్రిడ్...చౌకలో డిజిటల్ సేవలు...

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   AP Fiber Grid Inauguration : Ram Nath Kovind, Chandrababu Speech

   అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త...ప్రపంచమంతా వినియోగిస్తున్న అతిముఖ్యమైన మూడు డిజిటల్ సేవలను ఒకే వేదికగా ఎపి ప్రభుత్వం అతి తక్కువ ధరకే రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తెస్తుంది. ఫైబర్ గ్రిడ్ పేరుతో ఈ ముఖ్యమైన మూడు సేవలను అనుసంధానం చేసి ఎపి ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ చేతుల మీదుగా ఈ ఫైబర్ గ్రిడ్ నేడు ప్రారంభం కానుంది.

   కేవలం 149 రూపాయలకే టివి ఛానెళ్లు,ఇంటర్నెట్,మొబైల్ సేవలు ఈ మూడింటిని ఎపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించనుంది. డిజిటల్ వరల్డ్ లో అతి ముఖ్యమైన ఈ మూడు సేవలు ఇంత చౌకగా మరెక్కడా లభ్యం అయ్యే ఛాన్సే లేదని అధికారులు అంటున్నారు.

   ఫైబర్ గ్రిడ్...నేడే విడుదల...

   ఫైబర్ గ్రిడ్...నేడే విడుదల...

   ఎపి ప్రభుత్వం ఎప్పట్నుంచో ఊరిస్తున్న ఫైబర్‌గ్రిడ్‌ సేవలు నేటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ చేతుల మీదుగా ఈ ఫైబర్ గ్రిడ్ నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి టివి ఛానెళ్లు, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం కల్పించాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో ఎపి ప్రభుత్వ సంకల్పం కూడా నేడు నెరవేరనుంది.

   తొలిదశలో ఎంతమందికి...

   తొలిదశలో ఎంతమందికి...

   తొలిదశలో 1.10 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కనెక్షన్లు ఇచ్చారు. వీటిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 250 ఛానెళ్లను అందించడం, నెట్‌, టెలిఫోన్‌ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది.

   ఇలా ఇదే మొదటిసారి...

   ఇలా ఇదే మొదటిసారి...

   ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఫైబర్‌ గ్రిడ్‌ పథకం లేదని, రూ.149కే సామాన్యులకు ఈ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దేశంలో ఈ తరహా విధానం అమలుచేసేందుకు అండర్‌ గ్రౌండ్‌లో వైర్లు వేశారని, మన రాష్ట్రంలో మాత్రం విద్యుత్ స్తంభాల ఆధారంగా కేబుల్స్‌ వేశామని అధికారులు తెలిపారు. దీనివల్ల అతి తక్కువ ధరలో ఈ సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు.

   మారుమూల గ్రామాలకు సైతం...

   మారుమూల గ్రామాలకు సైతం...

   ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ ద్వారా మారుమూల పల్లెలకు సైతం టివి ఛానెళ్లు, మొబైల్‌,ఇంటర్నెట్ సేవలు అందనున్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3060 గ్రామాలు మొబైల్‌ సేవలు లేనివి ఉన్నాయి. వీటికి కూడ సీ గ్రిడ్‌ ద్వారా ఈ సేవల సదుపాయం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కిలోమీటర్ల మేర ఈ తరహా కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

   కేబుల్ ఆపరేటర్లు...స్పేస్ ఆప్టిక్ ద్వారా...

   కేబుల్ ఆపరేటర్లు...స్పేస్ ఆప్టిక్ ద్వారా...

   స్థానికంగా ఉన్న కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా ఈ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీనికోసం రెండు రకాలైన సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. కేబుల్‌ వ్యవస్థ లేని చోట్ల ఫ్రీస్పేస్‌ ఆఫ్టిక్‌ కనెక్షన్‌ పేరుతో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనున్నారు. దీని ద్వారా 20 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కేబుళ్లు లేకపోయినా ఇది పనిచేస్తుంది. గూగూల్‌ ఎక్స్‌ సంస్థ దీనికి సహకరిస్తుంది.

   పలురకాల ప్రయోజనాలు...

   పలురకాల ప్రయోజనాలు...

   ఫైబర్‌ నెట్‌ సిస్టమ్ లో భాగంగా విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించే అవకాశం లభిస్తోంది. తొలిదశలో నాలుగు వేల పాఠశాలల్లో వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కెమెరాలను ఏర్పాటు చేసి దీనికి అనుసంధానం చేయనున్నారు. తొలిదశలో ఐదువేల కెమెరాలను దీనికి అనుసంధానం చెయ్యడం పూర్తయింది. అలాగే పలు ప్రాంతాల్లో పబ్లిక్‌ వై ఫై సదుపాయమూ కల్పించనున్నారు.

   English summary
   With the ambitious aim of providing Internet connection along with telephone and tv channels to every household in Andhra Pradesh, Indian president ramnath kovid is to launch of the AP Fiber Grid in Amaravathi on wednesday. This project includes setting up a state-wide high speed optical fiber infrastructure utilising the existing assets of the electricity transmission/ distribution companies such as electrical poles and sub-stations.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more