వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టిసీమపై పుష్కరాల ఎఫెక్ట్, రాహుల్ గాంధీకి అశోక్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కరాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. తొలి రోజు విషాద ఘటన నేపథ్యంలో చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇది పట్టిసీమ ప్రాజెక్టు పైన పడిందని అంటున్నారు.

12 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండి పరిపాలన చేశారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మంత్రులతో భేటీ అయ్యారు. ఒకవిధంగా రాజమహేంద్రవరం తాత్కాలికంగా రాజధాని అయింది. చంద్రబాబు ఎక్కువగా పుష్కరాల పైన దృష్టి సారించారు.

మరోవైపు, పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాల కోసం తరలి వచ్చారు. దీంతో, ఈ 12 రోజులు పట్టిసీమ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. పట్టిసీమ కోసం వెళ్లే దారిలో భక్తులతో నిండిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు కోసం సిమెంట్, పైపులు, స్టీల్ తదితరాలను తీసుకు వెళ్లలేకపోయారు.

Pushkarams bring to a halt Pattiseema project works

షెడ్యూల్ ప్రకారం మార్చి 2016 నాటికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఫస్ట్ ఫేజ్ ట్రయల్ రన్ పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాకు నీరు ఇచ్చే పట్టిసీమ ప్రాజెక్టు పైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అశోక్ గజపతి రాజు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయడం లేదన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఖండించారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కోనాయపాలెం గ్రామంలో బహుళార్థ ప్రయోజన రక్షణ భవనాన్ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే విభజన జరిగిందని, పద్ధతిపరంగా విభజన చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

English summary
The 12 day grand celebration of the Godavari Pushkaralu has brought to a complete halt the construction works of CM Chandrababu Naidu's pet irrigation project - Pattiseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X