ఓటీటీలోనూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న రజినీకాంత్ "జైలర్"
తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి క్లాస్ యాక్షన్ తో నటించిన ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. జైలర్ గా రజినీకాంత్, ఆయన సరసన రమ్యకృష్ణ, నటులు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు, స్పెషల్ పాటలో ఉర్రూత లెక్కించిన తమన్నా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు.
థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకోవడం తో పాటు కలెక్షన్ల సునామి సృష్టించింది.ఇక థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజులైనా కాకముందే ఓ టి టి లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఓ టి టి లో విడుదలైన కొద్ది గంటల్లోనే జైలర్ సినిమా టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతుంది.

థియేటర్లలో రికార్డు సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా రికార్డును సృష్టిస్తోంది. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ లు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ లో విడుదలై తన జోరుని కొనసాగిస్తోంది. నిన్న ఓ టి టి స్ట్రీమింగ్ లో రిలీజైన ఈ సినిమా ఓ టి టి లో టాప్ ట్రెండింగ్ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తో పాటు హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా తలైవా రజనీకాంత్ కు మంచి పేరు తీసుకువచ్చింది. గత కొంతకాలంగా రజినీకాంత్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. అయితే జైలర్ సినిమా మాత్రంప్రేక్షకులు ఊహించిన దానికంటే గొప్పగా అందరి మనసులను గెలుచుకుంది.

73 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ రజినీకాంత్ తన స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 44.75కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. 91.10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు ఓటిటీ లో కూడా ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications