చెవిరెడ్డికి సుప్రీంలో బిగ్ రిలీఫ్-ట్రయల్ కోర్టుకు కీలక ఆదేశం..!

ఏపీలో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కాంలో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు ఆయన పిటిషన్లు దాఖలు చేస్తున్నా ఫలితం మాత్రం లేదు. దీనికి కారణం ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.

మద్యం స్కాం కేసులో చెవిరెడ్డిని గతంలో సీఐడీ సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టు అయిన విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్ధిస్తూ వచ్చారు. అయితే దీనికి ఏసీబీ కోర్టు ఒప్పుకున్నా హైకోర్టు అంగీకరించలేదు. మద్యం స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై నిర్ణయం తీసుకునేంత వరకూ చెవిరెడ్డి పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీంతో చెవిరెడ్డికి నిరాశ తప్పలేదు.

relief to ysrcp leader chevireddy bhaskar reddy in SC key order to trial court in liquor case

కల్తీ మద్యం స్కాం వెనుక వారే ? కేతిరెడ్డి సంచలనం- జోగి చేసిందిదే..!
ఈ నేపథ్యంలో ఆయన తన వెన్నునొప్పికి చికిత్స తీసుకునే అవకాశం అయినా ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరుతూ వస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చెప్పినట్లు మిథున్ రెడ్డి బెయిల్ విచారణ పూర్తయ్యే వరకూ తన బెయిల్ పై విచారణ జరపవద్దన్న ఆదేశాల్ని సుప్రీంలో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తన నిర్ణయం ప్రకటించింది. ఇతర నిందితుల బెయిల్ తో సంబంధం లేకుండా చెవిరెడ్డి బెయిల్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

relief to ysrcp leader chevireddy bhaskar reddy in SC key order to trial court in liquor case

దీంతో ఇప్పుడు చెవిరెడ్డి బెయిల్ వ్యవహారం మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టును చేరింది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చెవిరెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో పలుమార్లు విచారణలు జరిపిన ఏసీబీ కోర్టు.. ఇప్పుడు మరోసారి దీన్ని విచారించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో చెవిరెడ్డికి బెయిల్ లభించే అవకాశాలు మెరుగుపడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+