వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెం.1 హీరోయిన్‌ని, బాబు నాకేం చేయలేదు: రోజా, బాలకృష్ణ వ్యాఖ్యలపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేను తిరుపతిలో లడ్డూలు అమ్ముకొని బతకలేదని, సినిమాల్లో నేను నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు తన ఇమేజ్‌తో ఓట్ల కోసం చంద్రబాబు తనను రాజకీయాలలోకి తీసుకు వచ్చారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తాను చంద్రబాబు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు.

1999లో రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి తాను ప్రజా సమస్యల పైనే పోరాటం చేశానని చెప్పారు. నేను టిడిపిలో ఉండగా పార్టీ కోసం నేను ఖర్చు చేశానని, పార్టీ నుంచి మాత్రం ఏం తీసుకున్నది లేదన్నారు. ఆయన నుంచి ఏం సాయం పొందలేదని చెప్పారు.

తాను సవాల్ చేస్తున్నానని, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలలో తనలా ఎవరూ రాష్ట్రాన్ని తిరిగి రాలేదన్నారు. తాను రాష్ట్రంలో ప్రతి ఊరుకు వెళ్లానని, ఏ ఊరికి రాలేదో అడగవచ్చునని ప్రశ్నించారు. తాను మాత్రమే అందరికంటే ఎక్కువ తిరిగానని గర్వంగా చెప్పుకుంటానన్నారు.

Roja

మంత్రి పదవి కోసం తిడితే సంతోషం

అసెంబ్లీలో తనను తిడుతున్నారని, మంత్రి పదవి కోసం అలా చేస్తున్నారని చెబుతున్నారని, మంత్రి పదవి కోసమే, చంద్రబాబు సంతోషిస్తాడనో నన్ను తిడితే సంతోషమే అన్నారు. తనను తిడితే మంత్రి పదవులు వస్తాయనుకుంటే తిట్టి ఎంజాయ్ చేయండన్నారు.

వీడియో వేయడం మానండి

కానీ మహిళను అయిన తన పైన.. నేను అనని మాటలు అన్నట్లుగా చెప్పవద్దన్నారు. నేను ఓ మహిళను (అనిత) అన్నట్లుగా వీడియో చూపిస్తున్నారని, అలా వేయడం మానుకోవాలన్నారు. ఏదో ప్రభుత్వం నుంచి యాడ్‌లు వస్తాయని టిడిపి కార్యాలయం నుంచి వస్తే వేస్తారా అని ప్రశ్నించారు.

అధికార పార్టీ పురుషాహంకారానికి, మహిళకు మధ్య పోరాటం

అధికార పార్టీలోని పురుషాహంకారానికి, ఓ మహిళకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది అన్నారు. నేను చేయని తప్పుకు సారీ చెప్పనని, అలా సారీ చెబితే తప్పును అంగీకరించినట్లవుతుందన్నారు. తప్పును అంగీకరించినా వదిలేస్తారని చెప్పలేమన్నారు.

రావెల సుశీల్ కొవ్వెక్కి...

మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్ కొవ్వెక్కి అమ్మాయిని రేప్ చేయబోతే అతనిని ఇంత వరకు సస్పెండ్ చేయలేదన్నారు. ఓ ఆర్డిస్ట్ సరదాగా అన్నాడో, సీరియస్‌గా అన్నాడో కానీ, ఆడియో ఫంక్షన్లో చెప్పిన మాటలు గౌరవంగా లేవన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె బాలకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలను ఇదే టిడిపి ఎమ్మెల్యే అనిత సమర్థించడం విడ్డూరమన్నారు. అభిమానులను ఉత్సాహపరిచేందుకు అలా అన్నారని, ఆ వ్యాఖ్యల్లో తప్పులేదని అనిత చెప్పారన్నారు. వారు మాట్లాడితే కరెక్ట్, మేం మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. జగన్‌ను సభలోనే కొవ్వెక్కినట్లు అన్నారని, అది అవమానం కాదా అని మండిపడ్డారు.

English summary
YSR Congress Party MLA Roja did not take any help from Chandrababu, when she was in Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X