మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు: రోజాకు మళ్లీ షాక్, నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమెకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయనున్నారు.

ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్: పోటీ కూడా చేయను.. రోజా సంచలన వ్యాఖ్య

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన రోజా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి మాక్ పోలింగ్ నిర్వహించారని, స్పీకర్ చైర్‌లో ఉన్న కోడెల కూడా దానికి సహకరించారని ఆరోపించారు.

రోజా విమర్శలు, స్పీకర్ సీరియస్

రోజా విమర్శలు, స్పీకర్ సీరియస్

స్పీకర్ దిగజారి ప్రవర్తించారని రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి మాక్ ఓటింగ్ నిర్వహించడం సరికాదన్నారు. రోజా వ్యాఖ్యలను అసెంబ్లీ వర్గాలు స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాయి. దీనిపై ఆయన సీరియస్‌గా స్పందించారు.

రోజాకు నోటీసులివ్వాలని..

రోజాకు నోటీసులివ్వాలని..

నిబంధనలకు విరుద్ధంగా రోజా అసెంబ్లీ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం పట్ల స్పందించిన స్పీకర్ కోడెల శివప్రసాద రావు.. రోజాకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

Venkaiah Naidu praises Roja - Oneindia Telugu
మరోసారి షాక్

మరోసారి షాక్

దీంతో మరోసారి రోజా చిక్కుల్లో పడ్డారు. గతంలో శాసన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఆమెకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వనుంది.

రోజా వ్యాఖ్యలకు స్పీకర్ కౌంటర్

రోజా వ్యాఖ్యలకు స్పీకర్ కౌంటర్

తాను స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని కోడెల అన్నారు. తన ప్రవర్తన స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను హాజరవుతుంటానని, వైసిపి నేతలు కూడా తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటారన్నారు.

అన్ని పార్టీలు సమానమని.

అన్ని పార్టీలు సమానమని.

తనకు అన్ని పార్టీలు సమానమేనని స్పీకర్ కోడెల చెప్పారు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా తాను చూడనని చెప్పారు. ఓటింగ్ సందర్భంగా తాను టిడిఎల్పీ కార్యాలయానికి వెళ్లలేదని, ముఖ్యమంత్రికి, తనకు ఓటు ఎలా వేయాలో తన కార్యాలయం ఎదుటే అధికారులు సూచనలు చేశారన్నారు. కాగా, మాక్ పోలింగ్‌ను కోడెల పరిశీలించారే కానీ, ఆయన పాల్గొనలేదని టిడిపి నేతలు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party leader and Nagari MLA Roja will receive notices second time from Andhra Pradesh Assembly. Speaker Kodela Siva Prasad ordered to issue notices to Roja.
Please Wait while comments are loading...