విశాఖలో విజయసాయి రెడ్డి డ్యాన్స్ కట్టిస్తా .. నేనేంటో జగన్ కు బాగా తెలుసు : సబ్బంహరి

జీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారుల తీరుపై, దీనికి కారణమైన వైసీపీ నాయకులపై సబ్బం హరి భగ్గుమంటున్నారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన ఈ ఘటన వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందంటూ వ్యాఖ్యానించారు.

 విజయసాయి పశ్చాత్తాపపడే స్థాయికి తీసుకెళ్తా

విజయసాయి పశ్చాత్తాపపడే స్థాయికి తీసుకెళ్తా

తానేంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసని , బహుశా విజయసాయిరెడ్డికి ఇంకా తెలియదు అనుకుంటాను అంటూ పేర్కొన్న సబ్బం హరి విశాఖలో విజయ సాయి రెడ్డి డాన్స్ చేద్దాం అనుకుంటున్నారు .ఆయన డ్యాన్స్ కట్టిస్తా అంటూ మండిపడ్డారు. తన గురించి తెలియక ఏదో చేయాలని ఇదంతా చేశారని, ఎందుకు ఇలాంటి తప్పు చేశానని పశ్చాత్తాపపడే స్థాయికి విజయసాయిరెడ్డిని తీసుకు వెళతానని సబ్బం హరి పేర్కొన్నారు. ఇది లీగల్ గా వెళ్ళేంత పెద్ద అంశం కాదని, 24 గంటల్లోనే ఈ సమస్యను క్లోజ్ చేస్తానని సబ్బం హరి పేర్కొన్నారు.

 తానేమిటో సీఎం జగన్ కు తెలుసు .. తన ఆస్తులు పబ్లిక్ డొమైన్ లోనే

తానేమిటో సీఎం జగన్ కు తెలుసు .. తన ఆస్తులు పబ్లిక్ డొమైన్ లోనే

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తన ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉంటాయని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు సబ్బంహరి . తాను ఎంపీ కాక ముందే కాపులుప్పాడ లో ఒక స్థలం , మధురవాడలో ఒక ఇల్లు, ప్రస్తుతం కూల్చివేతకు గురైన ఇల్లు తప్పించి తనకు ఏమీ లేవని ఆయన పేర్కొన్నారు . తానేంటో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి రెండు మూడు సార్లు వచ్చి కూర్చున్నారని, నాడు పార్టీలో ఉన్న సమయంలోనే తన గురించి బాగా జగన్ కు తెలుసని వ్యాఖ్యానించారు సబ్బం హరి.

Recommended Video

    'Play Back' మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న Journalist Murthy !
    విజయసాయి భవిష్యత్ లో జడుసుకునేలా చేస్తా : సబ్బంహరి

    విజయసాయి భవిష్యత్ లో జడుసుకునేలా చేస్తా : సబ్బంహరి

    ప్రస్తుతం తనను భయపెట్టానని సంబరపడే విజయ సాయి రెడ్డి భవిష్యత్తులో తానే జడుసుకుంటాడు అంటూ సబ్బంహరి వ్యాఖ్యానించారు. అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఇలాంటి ఒత్తిడికి గురి అయితే ప్రభుత్వానికి సరెండర్ అవుతారు. కానీ తనకు అలాంటి అవసరం లేదన్నారు సబ్బం హరి . రాష్ట్రంలో మిగతా టీడీపీ ముఖ్యనాయకులపై కక్ష సాధిస్తూ తనను ఏమీ చెయ్యకుంటే బాగోదనే , తనపై కూడా ఒత్తిడి పెడితే అది అందరికీ తెలుస్తుంది అని భావించి కావాలనే ఈ కూల్చివేతకు దిగారని ఆయన అన్నారు . జగన్ మోహన్ రెడ్డి కానీ , జగన్ ప్రభుత్వం కానీ , విశాఖను ఏలుదామని ప్రయత్నం చేస్తున్న విజయసాయి కానీ తనను ఏమీ చెయ్యలేరని సబ్బం హరి గట్టిగా చెప్పారు . తానేమిటో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+