ముందే ప్లాన్ చేసుకుని ? యార్లగడ్డ రాజీనామాపై సజ్జల- గత వ్యాఖ్యల సమర్ధన...

ఏపీలో గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకు టికెట్ ఇమ్మని కోరినా పార్టీ నుంచి స్పందన లేకపోవడం, అనంతరం ఉంటే ఉండు లేకపోతే పొమ్మని అర్ధం వచ్చేలా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన యార్లగడ్డ ఇవాళ పార్టీని వీడారు. దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల స్పందించారు.

యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పడంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పార్టీలో టికెట్ల కోసం ఆశావహులు పెరిగారని తెలిపారు. ఎంతమంది ఆశావహులు ఉన్నా టికెట్ మాత్రం ఒక్కరికే ఇవ్వగలమన్నారు. ఏ పార్టీ అయినా ఇంతేనన్నారు. బలమైన పార్టీకి ఒత్తిడి ఉంటుందని గుర్తుచేశారు. వైసీపీలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో తాను మాట్లాడానని తాజాగా యార్లగడ్డపై తాను చేసిన వ్యాఖ్యల్ని సజ్జల సమర్ధించుకున్నారు.

sajjala ramakrishna reddy

అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని సజ్జల తెలిపారు. అంతే కానీ బయట మాట్లాడటం మంచిది కాదన్నారు. యార్లగడ్డ విషయంలో తాను ఇదే చెప్పానన్నారు. అయినా ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది అంటూ సజ్జల పరోక్షంగా యార్లగడ్డ రాజీనామాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వరుస మీటింగ్స్ పెట్టి ఉద్దేశాలు చెప్పడం మంచిది కాదని హితవు పలికారు. ఇది చూస్తుంటే ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉందన్నారు. పోతే పో అని యార్లగడ్డకు ఎవ్వరు అన్నారని సజ్జల ప్రశ్నించారు. ఆయనకు టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదన్నారు.

అంతకు ముందు గన్నవరంలో తన అనుచరులతో భేటీ అయిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి రాజీనామా చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో యార్లగడ్డను వైసీపీ ఎక్కడైనా సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. ఉంటే ఉండు, పోతే పొమ్మని సజ్జల చెప్పడం తనకు చాలా బాధ,ఆవేదన కలిగించిందన్నారు. టీడీపీ కంచుకోటలో ఢీ అంటే ఢీ అని పోరాడానని యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు. తన కళ్ళు చెమర్చాయని, వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వారిని కూడా చెత్త అనాలి కదా అన్నారు. నా బలం ఇప్పుడు బలహీనత అయిందా అని సజ్జలను ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+