Perni Nani: పేర్ని నానికి బిగ్ షాక్..! చంద్రబాబు, పవన్ ను తిట్టినందుకు..!
ఏపీలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి (perni nani) పోలీసులు ఇవాళ షాకిచ్చారు. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో త్వరలో పేర్నికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పేర్నినానికి మరోసారి చిక్కులు తప్పేలా లేవు.
రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పైనా రెచ్చిపోయారు. పేర్నినాని వ్యాఖ్యలపై ఆయన స్వస్థలం బందరులో టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. స్థానిక ఇనగుదురుపేట పీఎస్ లో టీడీపీ నేతలు పేర్నినాని వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పేర్ని నానిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ పేర్నినాని వివిధ సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేసినా అవన్నీ ఆ తర్వాత తేలిపోయాయి. కానీ ఈసారి మాత్రం పేర్నినాని చేసిన కామెంట్స్ పై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈసారి పేర్నినాని విషయంలో ఎలా వ్యవహరించబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో యాక్టివ్ గా కనిపిస్తున్న అతికొద్ది మంది నేతల్లో పేర్ని నాని కూడా ఒకరు. దీంతో పేర్ని దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications