Sujana Chowdary : సుజనా చౌదరికి లుక్ అవుట్ కొనసాగింపు- విదేశీ టూర్ కు అనుమతి..!

ఏపీలో టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా గెలిచి అనంతరం బీజేపీలోకి ఫిరాయించి ఎంపీగా పదవీకాలం పూర్తి చేసుకున్న సీనియర్ నేత సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఓ కేసులో సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సుజనాకు ఊరట లభించలేదు. అదే సమయంలో మరో విషయంలో మాత్రం ఊరట లభించింది.

బీజేపీ మాజీ ఎంపీ అయిన సుజనా చౌదరిపై 2017లో రుణాల ఎగవేత కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. సుజనాకు చెందిన బెస్ట్ క్రాంప్టన్ కేసు రూ.6 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసినట్లు గుర్తించింది. అంతే కాదు ఆయన్ను పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించి లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో సుజనా చౌదరికి స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల్ని రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

sujana chowdary as ts high court refuse to cancel look out notice

తనపై దాఖలైన రుణాల ఎగవేత కేసులో సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుజనా చౌదరి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. అందుకు నిరాకరించింది. ఆయనపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల్ని గంపగుత్తగా రద్దు చేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సీబీఐ లుక్ అవుట్ నోటీసు కొనసాగనుంది. అదే సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ఆయన చేసుకున్న అభ్యర్ధనపై ఊరటనిచ్చింది.

ఈ ఏడాది జూన్ 14 నుంచి 45 రోజుల పాటు దుబాయ్, లండన్, సింగపూర్ కు వ్యాపార పనుల నిమిత్తం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును మరో విజ్ఞప్తి చేశారు. దీంతో లుక్ అవుట్ నోటీసులు కొనసాగుతున్నా విదేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు అనుమతించేలా కీలక ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని అనుమతి తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుజనా విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+