బెంగళూరు రేవ్ పార్టీలో సెక్స్ దందా.. అనుమానాలకు కారణాలివే
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈ రేవ్ పార్టీలో లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీ మాటున సెక్స్ దందా కూడా జరిగినట్టుగా బెంగళూరు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రేవ్ పార్టీలో సెక్స్ దందా
రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడం, అక్కడ పార్టీలో పాల్గొన్న చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్ లు రావటం, డబ్బు విపరీతంగా ఖర్చు చేసి రేవ్ పార్టీ నిర్వహించడంతో ముఖ్యంగా 30 మంది యువతులను, అందులో 20 మంది మోడల్స్ ను ఫ్లైట్ టికెట్లు వేసి మరి బెంగళూరుకు తీసుకురావడం వెనుక ఈ రేవ్ పార్టీలో వ్యభిచార దందా జరిగిందేమో అన్న అనుమానం పోలీసులకు బలపడుతోంది.

2 లక్షల ఎంట్రీ ఫీజుతో 200 మందికి ఆహ్వానం
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన రేవ్ పార్టీలో నిర్వాహకులు ఒక్కొక్కరి నుండి రెండు లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు తీసుకొ,ని 200 మందిని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక కు చెందిన క్రికెట్ బుకీలు, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలుగురు నటీనటులు, తెలుగు కన్నడ సీరియల్ లో పనిచేసే నటులు పాల్గొన్నారు.
నిర్వాహకుడు చీకటి దందాల స్పెషలిస్ట్
అయితే ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్ళిపోగా, మిగిలిన వాళ్ళు అర్ధరాత్రి జరిగిన పార్టీలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ రేవ్ పార్టీ నిర్వహించిన నిర్వాహకుడు చీకటి దందాల స్పెషలిస్ట్ గా పోలీసులు గుర్తించిన క్రమంలో ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ నడిపినట్టుగా ఆ దిశలో కూడా దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు.
ఈ కారణాలతో సెక్స్ దందాపై బలపడిన అనుమానాలు
ఈ పార్టీకి ప్రధాన సూత్రధారి అయిన లంకపల్లి వాసు తన బర్త్ డే పార్టీ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీకి 2 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడం, 30 మంది యువతులను ఫ్లైట్ టికెట్ ఖర్చుతో సహా పెట్టుకుని తీసుకురావడం వంటి కారణాలు సెక్స్ దందాపై అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. ఇక ఈ రేవ్ పార్టీలో ఈ కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications