వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు చెప్పినా విభేదాలు, ఏపీ టిడిపి అధ్యక్షుడికి షాక్: శిష్యుడే డుమ్మా, అందుకే

టిడిపికి రెండోసారి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన మంత్రి కళా వెంకట్రావు పర్యటనలో విభేదాలు వెలుగు చూశాయి.

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: టిడిపికి రెండోసారి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన మంత్రి కళా వెంకట్రావు పర్యటనలో విభేదాలు వెలుగు చూశాయి.

జగన్-మోడీ భేటీ ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షాక్, సమన్లు, ఎందుకంటే..?జగన్-మోడీ భేటీ ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షాక్, సమన్లు, ఎందుకంటే..?

టిడిపి నేత, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ భర్త చౌదరి బాబ్జీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇటీవలి రాష్ట్ర కమిటీలో సీనియార్టీని గుర్తించకుండా బాబ్జీని పక్కన పెట్టారన్న కారణంతో చైర్‌పర్సన్ దంపతులు ముఖం చాటేశారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

 వారే స్వాగతం పలికారు

వారే స్వాగతం పలికారు

జిల్లాకు తొలిసారి రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం పలికిన వారిలో రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులే అధికంగా ఉన్నారన్న చర్చ మొదలైంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు అసెంబ్లీ సెగ్మెంట్‌ల నుంచి శాసనసభ్యుల నుంచి సాధారణ కార్యకర్తల వరకూ కార్యక్రమంలో భాగస్వామ్యులు కాకపోవడం చర్చనీయాంశమయ్యింది.

 కీలక నేతలు లేకపోవటం చర్చనీయాంశమైంది

కీలక నేతలు లేకపోవటం చర్చనీయాంశమైంది

మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు శివాజీ, అశోక్, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తిలు సన్మాన కార్యక్రమంలో లేకపోవడంతో చర్చనీయాంశమయ్యింది.

బాబు మాటలు పెడచెవిన పెట్టారని

బాబు మాటలు పెడచెవిన పెట్టారని

2019లో 10 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ఇటీవల చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన ప్రసంగాలు ఇక్కడ నేతలు పెడచెవిన పెడుతున్నారనడానికి తాజాగా కళా సన్మానం ఓ వేదికగా నిలిచిందని అంటున్నారు.

కళాను ప్రశంసించారు

కళాను ప్రశంసించారు

సన్మాన కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష , పాలకొండ ఇంచారజ్ నిమ్మక జయకృష్ణలు హాజరై ప్రశంసలు కురిపించారు. మత్స్యకారుల సన్మాన కార్యక్రమానికి ముందు శ్రీకాకుళం, ఆమదాలవలస ముఖ్య నేతలు కళాను సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు.

 కళా ర్యాలీకి ఆయన గైర్హాజరు

కళా ర్యాలీకి ఆయన గైర్హాజరు

రాజకీయాల్లో కళా వెంకటరావును గురువుగా భావించే నడుకుదిటి ఈశ్వర రావు ఆయన స్వాగత కార్యక్రమానికి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కళా తొలిసారిగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు , ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు, విద్యుత్ శాకామంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుండి విశాఖపట్నం నుండి రాజాం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ స్థాయిలో ఈశ్వర రావు బహిరంగ సభలను ఏర్పాటు చేసి కేడర్‌ను సమాయత్తం చేసేవారు. దీంతో కళా కార్యక్రమాలకు జిల్లా కేడర్ రాకపోయినా ఆ ప్రభావం కనబడేది కాదు.

గుర్తింపు ఇవ్వడం లేదనేనా

గుర్తింపు ఇవ్వడం లేదనేనా

అయితే కళా గెలుపునకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయానికి కీలకమైన ఈశ్వరరావుకు ఆయన సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రెండుసార్లు రాష్టక్రమిటీ, జిల్లా కమిటీకిశాసన మండలి ఎన్నికల్లో ఈశ్వరరావుకు ఏదో ఒక పదవి వస్తుందని అందరూ భావించారు.

 ఇన్నేళ్లయినా పదవి లేదు

ఇన్నేళ్లయినా పదవి లేదు

ఇదే మాట కళా కూడా ఈశ్వరరావుకు చెప్పిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అధికారం వచ్చిన సుమారు మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయనకు ఎటువంటి గుర్తింపునివ్వకపోవడంతో స్వాగత కార్యక్రమానికి చినుక వహించినట్లుగా భావిస్తున్నారు.

English summary
Shock to Andhra Pradesh Telugu Desam Party chief and Minister Kala Venkat Rao in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X