చంద్రబాబు కోసం.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక వైద్య బృందం!!
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సెంట్రల్ జైల్లో స్నేహ బారెక్ లో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆరోగ్యం విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుండి ఆందోళన వ్యక్తం అవుతుంది. చంద్రబాబును మానసికంగా కృంగ దీయడానికి, జైల్లో చంద్రబాబుని ఇబ్బందులు పెట్టడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ములాఖత్ ను నిరాకరించారని కూడా చర్చ జరుగుతుంది.

ఇదిలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం పదిమంది సభ్యులతో కూడిన మెడికల్ టీంను ప్రభుత్వం నియమించింది.
వీరిలో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి నియమించిన ఐదుగురు వైద్యులలో ముగ్గురు వైద్యులు రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వారని సమాచారం. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో వీరు ఉంటారు.
మరో ఇద్దరు డాక్టర్లు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో పనిచేస్తారు. మరోవైపు చంద్రబాబుకు అవసరమైన అన్ని అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది. రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం కూడా అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మెడికల్ టీం ఏర్పాటుతో తెలియజేసింది వైసీపీ ప్రభుత్వం.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications