ఉత్కంఠకు తెర: కాకినాడ మేయర్‌గా పావని, అందుకే ఈ ఎంపిక

Subscribe to Oneindia Telugu
  Kakinada Municipal Corporation Mayor ఉత్కంఠకు తెర: కాకినాడ మేయర్‌గా.. | Oneindia Telugu

  తూర్పుగోదావరి: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, కార్పొరేటర్లు చర్చించి నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేశారు. దీంతో సీఎం సూచన మేరకు సుంకర పావనిని మేయర్‌గా ఎంపిక చేశారు.

  డిప్యూటీ మేయర్‌గా సత్తిబాబును ఎన్నుకున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పావని 28వ డివిజన్ నుంచి గెలుపొందగా, 2వ డివిజన్ నుంచి సత్తిబాబు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు అండగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  Sunkara Pavani Elected as Kakinada Municipal Mayor

  అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం మేయర్‌ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. కాగా, 30ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కాకినాడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత లభించింది. 

  మేయర్ సంబరం: కార్పొరేటర్ శేషుకుమారి తీవ్ర అసంతృప్తి

  మేయర్‌గా ప్రమాణం చేసిన అనంతరం పావని మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఇది ఇలా ఉండగా, మరో కార్పొరేటర్ శేషుకుమారి మేయర్ పదవి తనకు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తనకు అవమానమని అన్నారు. పార్టీకి చాలా సేవ చేశానని, అధిష్టానం మాత్రం తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Sunkara Pavani is elected as Kakinada Municipal Corporation Mayor.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి