వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైర్మన్ స్వామిగౌడే, కేసీఆర్‌కు ఎక్కువైంది: షబ్బీర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా స్వామి గౌడ్ ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ పదవి కోసం తెరాస నుండి స్వామిగౌడ్, కాంగ్రెసు పార్టీ నుండి ఫరూక్ హుస్సేన్‌లు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తెరాస తీరును తప్పు పడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నిక నుండి తప్పుకుంది. దీంతో స్వామిగౌడ్ గెలుపు లాంఛనం అయింది. ఓటింగులో పాల్గొన్న 21 మంది ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌కే ఓటేశారు. ఆయనను పలువురు అభినందించారు. కాగా ముప్పై ఏళ్ల తర్వాత తొలిసారి చైర్మన్ ఎన్నిక జరిగింది.

విప్ ధిక్కరించి పలువురు కాంగ్రెసు, టీడీపీ సభ్యులు స్వామికి ఓటు వేశారు. కాంగ్రెస్, టీడీపీ విప్ ధిక్కరించిన వారిలో.. విద్యాసాగర్, రాజేశ్వర్ రెడ్డి, యాదవ రెడ్డి, భానుప్రసాద్, ఆమోస్, జగదీశ్వర్ రెడ్డి, రాజలింగం, భూపాల్ రెడ్డి, సలీం, వెంకటేశ్వర్లు, పట్నం నరేందర్‌లు ఉన్నారు. ఇద్దరు మజ్లిస్ ఎమ్మెల్సీలు, స్వతంత్ర సభ్యుడు నాగేశ్వర రావులు స్వామికే ఓటు వేశారు.

Swamy Goud elected as Council chief

మండలి నుండి వాకౌట్ చేసిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో డీ శ్రీనివాస్ మాట్లాడారు. అధికార పార్టీ చైర్మన్ ఎన్నికపై ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. బంగారు తెలంగాణను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై ఆ పార్టీ దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. తాము అస్త్ర సన్యాసం చేయలేదన్నారు. దొంగచాటుగా, ప్రలోభాలు పెట్టి ఇలా చేయడం సరికాదన్నారు.

తమ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు ఓటు వేస్తే తెరాసకు వేసినట్లేనని, వారు ఓటు వేస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెరాసకు ఓటేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీ తీరు నచ్చకే తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పారు.

కేసీఆర్ మైనార్టీలకు వ్యతిరేకమని షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. మైనార్టీలకు వ్యతిరేకి అయిన వ్యక్తిని కేసీఆర్ అడ్వోకేట్ జనరల్‌గా నియమించారని ఆరోపించారు. తెరాస తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌కు అధికార కాంక్ష ఎక్కువైందన్నారు. ఆయనకు రైతుల సమస్యల గురించి తెలియదని విమర్సించారు.

English summary
TRS leader Swamy Goud elected as Council chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X