Chiranjeevi Birthday : చిరుకు చంద్రబాబు, పవన్ బర్త్ డే విషెస్...ఏం చెప్పారంటే.. !
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవితో అనుబంధం ఉన్న వారు, అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలువురు నేరుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత, చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు తన ట్వీట్ లో చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సినీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరచుకున్న మెగాస్టార్ @KChiruTweets గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు... నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే చిరు సోదరుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఇందులో అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది అన్నారు.
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సినీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరచుకున్న మెగాస్టార్ @KChiruTweets గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు... నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా… pic.twitter.com/7CP5riq6Oh
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2023
అలాగే మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..! అంటూ పవన్ కళ్యాణ్ ముగించారు.












Click it and Unblock the Notifications