రోజాకు బికినీ, కట్ డ్రాయర్లు పంపుతాం-మాకు చీరలు పంపుతావా ? టీడీపీ నేత షాకింగ్

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మంత్రి అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా చంద్రబాబు, లోకేష్ పై చేసిన చీరల వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. కొడుకు లోకేష్ ను గెలిపించుకోలేని చంద్రబాబుకు ఏ చీర పంపాలో చెప్పాలంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోజక్కకు సూటి ప్రశ్నలు వేస్తున్నానంటూ మొదలుపెట్టిన టీడీపీ నేత వెంకటరమణారెడ్డి నిన్న ఆమె చేసిన చీరల వ్యాఖ్యలపై మండిపడ్డారు. దిశ యాప్ కోటీ 40 లక్షల మంది డౌన్ లోడ్ చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇన్ని రేప్ లు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్మాదులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నీలాంటి ఉన్మాదులు పుట్టింది ఇక్కడేగా అని విమర్శించారు. టీడీపీ నేతలు కాల్ మనీ, సెక్స్ రాకెట్లలో ఉన్నారంటున్న రోజా.. గతంలో తాను కూడా తన వీడియోలపై ఇచ్చిన ఫిర్యాదు గుర్తు తెచ్చుకోవాలని ఆనం తెలిపారు.

tdp launches counter attack on ap minister rk rojas saree comments on chandrababu and lokesh.

విజయమ్మ, భారతిని ఏమన్నా సహించబోమంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆనం.. మీరు మాత్రం మా కుటుంబాలను ఇష్టారాజ్యంగా తిట్టొచ్చు కానీ మేం మాత్రం ఏమీ మాట్లడకూడదా అని ప్రశ్నించారు. లోకేష్ ను గెలిపించుకోలేని చంద్రబాబుకు చీర పంపుతానన్న రోజా.. విశాఖలో తల్లి విజయమ్మను గెలిపించుకోలేని జగన్ కు ఏం పంపాలని నిలదీశారు. తమకు చీరలు పంపిస్తామన్న రోజా వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆమెకు బికినీ, లిప్ స్టిక్, పాత కట్ డ్రైయర్లు పంపిస్తామన్నారు. కిలోల్లో పంపమంటావా, కంటెయినర్లలో పంపమంటా అని ప్రశ్నించారు.

tdp launches counter attack on ap minister rk rojas saree comments on chandrababu and lokesh.

రాజకీయంగా టీడీపీని ఎంతైనా విమర్శించు కానీ, జగన్ సంతోషం కోసం వ్యక్తిగత విమర్శిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి రోజాను ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. రాజకీయం, పవర్ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చేసిన తప్పులకు భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుందని రోజాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+