టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..! పవర్ ఫుల్ పాత్రలో..!

తెలుగు చిత్ర పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎంతో అనుబంధం ఉంది. టీడీపీకి చెందిన పలువురు నటీనటులు అటు టాలీవుడ్ లో, ఇటు పార్టీల్లో కీలక పాత్రలు పోషించారు. గతంలో టాలీవుడ్ లో నిరూపించుకున్నాక టీడీపీలో ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులుగా ఉంటూ కూడా తెలుగు సినిమాల్లో గెస్ట్ పాత్రల నుంచి పూర్తిస్దాయి పాత్రల్లో నటించిన వారూ ఉన్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో మరో టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్నారు.

ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!
ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!

టీడీపీకి చెందిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ (Gurajala Jagan Mohan) ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టాలీవుడ్ చిత్రం 'ది బ్రెయిన్ 'లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన హోంమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాలో నటించేందుకు గురజాల జగన్మోహన్ సిద్ధమవుతున్నారు. దీంతో ఈ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

TDP MLA Gurajala Jagan Mohan Makes Silver Screen Debut in The Brain
AP Local Body Elections: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బంతి..! తేడా వస్తే సర్కార్ ప్లాన్ బీ..!
AP Local Body Elections: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బంతి..! తేడా వస్తే సర్కార్ ప్లాన్ బీ..!

రాజకీయాల్లో అనుభవం కలిగిన నాయకుడైన గురజాల జగన్మోహన్.. ఇప్పుడు టాలీవుడ్ చిత్రంలోనూ అదే రాజకీయంతో లింక్ ఉన్న హోంమంత్రి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కనిపించిన ఆయన.. టాలీవుడ్ మూవీలో హోంమంత్రిగా అదే అసెంబ్లీలో కనిపించబోతున్నారు. దీంతో గురజాల జగన్మోహన్ టాలీవుడ్ ఎంట్రీ కూటమి పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని సినిమాల్లో ఆయన నటించే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+