మోడీ-పకోడి కావాలా నాయానా...నెల్లూరులో టిడిపి వినూత్న నిరసన

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

నెల్లూరు:ఎపి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల్లూరులో టిడిపి విద్యార్థి సంఘం సభ్యులు వినూత్ననిరసన చేపట్టారు. ఒక పకోడి బండి పెట్టి...ఆ పకోడికి మోడీ పేరు పెట్టి హల్ చల్ చేశారు. అలాగే గుజరాతీ ఛాయ్ మా స్పెషల్ అంటూ టీ అమ్మకాలు కూడా చేశారు

నెల్లూరులో రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంపై తెలుగుదేశం విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వీఆర్ సీ సెంటర్ లో రోడ్డుపై పకోడి వేయడం తో పాటు ఆ పకోడీకి మోడీ-పకోడీ అని నామకరణం చేసి రోడ్డు వెంబటి వెళ్లేవారిని ఉద్దేశించి మోడీ పకోడీ కావాలా నాయానా అంటూ నినాదాలు చేశారు.

 TDP Student wing stage innovative protest against Central Govt.

అలాగే ఎపిని కేంద్రం దారుణంగా మోసగించిందంటూ టీ అమ్మకాలు కూడా చేశారు. మోడీ-పకోడీతో పాటు గుజరాతీ ఛాయ్ మా ప్రత్యేకత అంటూ బ్యానర్ పెట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని...ఇక ఎపిలో యువత పరిస్థితి...మోడీ పేరు చెప్పుకుంటూ పకోడీ-టీ అమ్ముకోవడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore: In an innovative protest against the central government towards the AP , students of Telugudesam vidyardhi parishat sold Modi-Pakodi and Gujarathi Tea on today in Nellore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి