విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళను వివస్త్రను చేసి ఎలా కొట్టారో చూడండి, వీడియో!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జాకెట్ కూడా తీసేసి మహిళను ఎలా కొట్టారో చూడండి, వీడియో !

విశాఖపట్నం జిల్లాలో మరో దారుణం చొటుచేసుకుంది. ఎస్సీ మహిళ పట్ల కొందరు దారుణం గా ప్రవర్తించారు. బట్టలూడదీసి, జాకెట్ లేని ఆ మహిళను దారుణంగా కొట్టారు. పెందుర్తి మండలం శివారులో స్థానికుల్లో కొందరికి ఎస్సీలతో స్ధలం విషయంలో వివాదం మొదలైంది. కాళీగా ఉన్న కొంత డీఫారం భూమి ని అధికారులు కొందరు పేదలకు కేటాయించారు. అయితే స్ధలాన్ని చదును చేయటానికి అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ఎస్సీలతో గొడవైంది.

అదే స్ధలం చాలా కాలంగా తమ ఆధీనంలో ఉన్నదంటూ అధికారులకు ఎస్సీలు అడ్డుపడ్డారు. దాంతో అధికారులకు ఓ ఎస్సీ కుటుంబానికి బాగా గొడవైంది. ఇంతలో ఓ మహిళ పట్ల అధికారపార్టీ నేతలు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ ఎస్సీ మహిళను కొట్టి రోడ్డుపై పడేసారు. తర్వాత బట్టలూడదీసారు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. అధికార పార్టీ పై పెందుర్తి పోలిస్ స్టేషన్ లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతొ దూషించటమే కాకుండా జుట్టుపట్టుకుని ఈడుచుకొని వెళ్లారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఇక బాధితులకు అండగా వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగి ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసేంత వరకు కదలనని కూర్చున్నారు. స్థల వివాదం విషయమై ఎస్సీ మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు డీసీపీ తెలిపారు.

English summary
Andhra Pradesh police on Wednesday arrested seven out of the eight accused who beats a Dalit woman and dragged her, after she objected to the digging of a pit at Jerripothulapalem village in Visakhapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X