తాడిపత్రిలో టెన్షన్.. పెద్దారెడ్డి ఇంటికి జేసీ ప్రభాకర్ రెడ్డి; పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న తాడిపత్రిలో టిడిపి వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ రాళ్ల దాడికి దారి తీయగా, ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు గాయపడటంతో పాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. ఎస్పీ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ కు గాయాలయ్యాయి.
పోలీస్ స్టేషన్ ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా
ఈ ఘటన మరిచిపోకముందే మళ్లీ నేడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న టిడిపి నేత సూర్య ముని ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ఈరోజు పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. తర్వాత ఆయన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు కార్యకర్తలతో వెళుతుండగా వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి.

టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
దీంతో మళ్ళీ టిడిపి వైసిపి శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రాయలసీమలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన తాడిపత్రి ఎన్నికల ప్రారంభం నుంచి రావణ కాష్టంలా రగులుతుంది. అడుగడుగున వైసిపి, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు.
దాడులు చేసుకోవటం పరిపాటిగా మారిన తాడిపత్రి
నిన్న వైసీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. తెలుగుదేశం పార్టీకి సహకరించిన వారిపైన వైసిపి దాడులు చేయడం, తమ వారిపై దాడి చేసిన వారిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడడం ఇక్కడ పరిపాటిగా మారింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి
ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన కనిపిస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎంత పటిష్టమైన బందోబస్తు నిర్వహించినప్పటికీ తాడిపత్రి నియోజకవర్గం లో మాత్రం దాడులు ఆగడం లేదు. జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరుగుతున్న వార్ లో భాగంగా ఈ దాడుల పరంపర కొనసాగుతుంది.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఛార్జిషీటు
జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లడంపై పోలీసులు జేసీపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడంతోపాటు గొడవలు జరగడానికి కారకులయ్యారంటూ పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications