అమరావతిలో బుద్దుడి ఆలయం నిర్మాణం: థాయ్‌లాండ్ కాన్సుల్ జనరల్ వెల్లడి
విశాఖపట్టణం: అమరావతిలో తమ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బుద్ధుడి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచే విధంగా ఉంటుందని థాయ్‌లాండ్ కాన్సుల్ జనరల్ క్రాంగ్ నిట్ రాకరీన్ వెల్లడించారు. శనివారం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
తాము గతంలో ఇలాగే బుద్ధగయలో 1956లోనే ఒక బౌద్ధ దేవాలయం నిర్మించామని అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిందన్నారు. కొన్ని దశాబ్దాల విరామం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అదే స్థాయిలో బుద్దుడి ఆలయం నిర్మించనున్నామని ఆమె తెలిపారు. బుద్ధిజం భారత్ నుంచే వ్యాప్తి చెందినందున భారత్ అంటే తమ దేశం వారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు.

అమరావతిలో బౌద్ద ఆలయం ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారని, పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పినందున అందులో థాయ్‌లాండ్ నిర్మాణ శైలిలో బుద్దుని ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఎపిలో బౌద్ధ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఆయా ప్రణాళికలకు తమ థాయ్‌లాండ్ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు.
అలాగే ధాయ్ లాండ్, ఆంధ్రప్రదేశ్ ల మధ్య స్నేహ సంబంధాలు మరింత వృద్ది చెందేందుకు వీలుగా ఎపి, థాయ్ లాండ్ మధ్య డైరెక్ట్ విమానం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications