తలైవా రజినీకాంత్ పుట్టినరోజు: మై డియర్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబు శుభాకాంక్షలు!!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ ని సెట్ చేసిన రజినీకాంత్ ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం తన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఆయనకు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు రజినీకాంత్ కు తమ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మై డియర్ ఫ్రెండ్ అంటూ రజనీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఆయన మంచి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని కోరుకున్నారు. రజినీకాంత్ చేపట్టిన ప్రతి పనిలోనూ ఆయనకు విజయం చేకూరాలని ట్వీట్ చేశారు.

Birthday greetings to my dear friend, superstar @rajinikanth. I wish him good health, happiness and continued success in all his endeavors. pic.twitter.com/ficz8c1nSL
— N Chandrababu Naidu (@ncbn) December 12, 2023
ఈ సందర్భంగా రజినీకాంత్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసిన చంద్రబాబు రజనీకాంత్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబుపై కూడా రజినీకాంత్ అనేకమార్లు బహిరంగం గానే ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని రజినీకాంత్ కూడా పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆయనను వైసీపీ నేతలు ఎంతగా టార్గెట్ చేసినా రజినీకాంత్ లెక్క చేయలేదు. చంద్రబాబుతో ఉన్న స్నేహాన్ని రజనీకాంత్ అదే విధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక చంద్రబాబు మాత్రమే కాదు రజినీకాంత్ కు చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Birthday greetings to one of the most versatile actors of all time and an icon Sri @rajinikanth Garu.
— G Kishan Reddy (@kishanreddybjp) December 12, 2023
His career in the film industry & philanthropic engagements has won our hearts.
Wishing you a long & healthy life. pic.twitter.com/4ymx3QYiGl
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటులలో ఒకరైన రజినీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసి, సినీ పరిశ్రమతో పాటు సేవా రంగంలోనూ రజినీకాంత్ అందరి హృదయాలను గెలుచుకున్నారు అని మీరు సుదీర్ఘమైన ఆయుష్షును, ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఇక వీరు మాత్రమే కాదు లోకేష్ కనగ రాజ్, ధనుష్, సురేష్ రైనా తదితరులు కూడా రజినీకాంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications