Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అత్యంత శక్తివంతమైన అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ యంత్రం తయారుచేసింది ఏపీ వాసి!!

దేవాలయం ఏదైనా సరే.. విగ్రహ ప్రతిష్ట జరగాలంటే అందుకు సంబంధించిన యంత్రం అత్యంత కీలకం . అందులోను ప్రపంచ వ్యాప్తంగా వున్నా హిందువుల దశాబ్దాల కలగా వున్న సాక్షాత్తు ఆ అయోధ్య రాముని రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ప్రాణప్రతిష్ట యంత్రం అత్యంత శక్తివంతం. అలాంటి శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ట యంత్రం తెలుగు నెల పైనే తయారైంది.

అయోధ్య ప్రాణప్రతిష్ఠ కోసం శ్రీరామయంత్రాన్ని సమర్పించే అంతటి మహద్బాగ్యం బాపట్ల జిల్లా చీరాల కు చెందిన అన్నదానం చిదంబరశాస్త్రి కి దక్కింది . ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట జరుపుకోబోతున్న అయోధ్య శ్రీరామ చంద్రుడికి సంబంధించిన రామయంత్రాన్ని తయారు చేసే బాధ్యత తనకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. రామభక్తుడైన హనుమంతుడి ద్వారానే తనకు ఈ అదృష్టం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

 The most powerful Sri Rama Pranapratistha Yantra is made in AP!!

1970 నుంచి రామ,హనుమత్ ఉపాసనలో ఉండటం తో పాటుగా హనుమంతుని తొమ్మిది అవతారాలకు సంబంధించి తొమ్మిది ఆలయాలు నిర్మాణాలు చేయడం, యంత్ర ప్రతిష్టలు చేయటం వలన అయోధ్య రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఇంతటి మహత్తర బాధ్యతను తనకు అప్పగించారన్నారు .అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట యంత్రాన్ని సైతం ఎంతో కఠోర దీక్షతో రామ దీక్షలోనే ఉండి యంత్రాన్ని సిద్ధం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు .

ఇదిలా ఉంటే ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు బిజెపి నేతలు.

దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ 500 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న శుభపరిమాణం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుందని, అయోధ్య రామచంద్రయ్య ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహింపబడనుందన్నారు. యావత్ ప్రపంచంలోని హిందువులందరికీ ఇది పెద్ద పండుగలాంటిదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+