ఘనంగా ప్రారంభమైన శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకతలు ఇవే!

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం శ్రీశైలం పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా బ్రహోత్సవాల నిర్వహణ జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు మహా శివారాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీశైలం పుణ్య క్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందటంతో మహా శివరాత్రికి ఇక్కడ స్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు.

ఘనంగా ప్రారంభమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

నేటి నుండి ఈనెల 18 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,సభ్యుడు,ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు.అర్చకులు వేదపండితులు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు.

The Srisailam Brahmotsavams for Maha Shivratri have begun grandly Here are the special features

భక్తుల కోసం జర్మన్ షెడ్ లు

ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు స్వామి అమ్మవారి దర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా జర్మన్ షెడ్లు వేసి ఏర్పాట్లు చేశారు. అలానే భక్తులకు 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్తున్నారు. నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.

ఆ తేదీల్లో నో టోల్,హెల్ప్ డెస్క్ లు

నేటి నుండి ఈనెల 12వ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లుతెలిపారు. ఈ సంవత్సరం కూడా నా 13 నుండి 16 వరకు ఉచితంగా 50 గ్రాముల లడ్డును అందిస్తామని అలానే 15,16వ తేదీల్లో వాహనాలకు టోల్ ఫీజులు కట్టకుండానే అనుమతిస్తామని పేర్కొన్నారు. శివసేవకుల ద్వారా క్షేత్రంలో 12 చోట్ల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని, భక్తులకు సహాయం చేస్తామని చెప్తున్నారు.

భక్తుల కోసం మొబైల్ యాప్

సెల్ ఫోన్ లో వన్ స్టాప్ సొల్యూషన్ యాప్ ద్వారా వాళ్ళు చేరుకోవాల్సిన ప్రదేశానికి త్వరగా చేరుకునేలా యాప్ రూపొందించామని ఇప్పటికే క్షేత్రానికి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్, ఈవో శ్రీనివాసరావు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+