Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తీపి జ్ఞాపకాలు.. ఆ అంబాసిడర్ కారు ఫోటోలను షేర్ చేసిన సీఎం చంద్రబాబు

రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రజలలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వారికి ఇష్టమైనవి ఏమిటి? వారు ఎటువంటి పనులను చేయడానికి ఇష్టపడతారు? ఎలాంటి వస్తువులను కొనుగోలు చేస్తారు? వారి జీవితంలో వారు ప్రత్యేకంగా చూసేవి ఏవైనా ఉన్నాయా? వారు ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? ఇలా అనేక విషయాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు.

విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబు
అప్పుడప్పుడు వాటి తాలూకా జ్ఞాపకాలను ప్రజలతో పంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక అదే క్రమంలో తాజాగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తనకు చాలా ఇష్టమైన ఓ కారుకు సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. చాలా పాతగా ఉన్న అంబాసిడర్ కారు పక్క నిలుచున్న చంద్రబాబు "విత్ మై ఓల్డ్ ఫ్రెండ్" అంటూ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

This is CM Chandrababu favorite car These are the specialties

చంద్రబాబుకు ఇష్టమైన కార్ ఇదే
చంద్రబాబు దానికి ఎంతో ఇష్టమైన అంబాసిడర్ కార్ ఫోటోలు పోస్ట్ చేయడంతో, ప్రస్తుతం ఆ కారు గురించి అందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. చంద్రబాబుకు ఇష్టమైన కార్ గతంలో ఆయన ఉపయోగించిన 393 నెంబర్ తో ఉన్న కారు గత 30 ఏళ్లుగా దాన్ని ఎంతో జాగ్రత్తగా చంద్రబాబు చూసుకుంటున్నారు. మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు ఉపయోగించిన అంబాసిడర్ కార్ ను ఆయన పార్టీ కార్యాలయంలో సందర్శించారు.

గతంలో చంద్రబాబు తిరిగిన కారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో ఇది ఒక భాగంగా ఉండేది. 393నెంబర్ గల ఈ అంబాసిడర్ కారులో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటించారు. ఇక చంద్రబాబు నాయుడు బ్రాండ్ కార్ గా అప్పట్లో గుర్తించబడింది. ప్రస్తుతం ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రతా కారణాల దృష్ట్యా ఈ కారును వినియోగించనప్పటికి ఆయనకు మాత్రం ఈ కార్ అంటే ఎనలేని ప్రేమ ఉంది.

This is CM Chandrababu favorite car These are the specialties

పాత అంబాసిడర్ కారును ఎంతో అపురూపంగా చూసుకున్న చంద్రబాబు
ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఆధునిక వాహనాలను వినియోగిస్తున్న చంద్రబాబు, తాను గతంలో ఉపయోగించిన పాత అంబాసిడర్ కారును ఎంతో అపురూపంగా భావిస్తున్నారు అని చెప్పడానికి ఆయన రీసెంట్ పోస్ట్ ఒక ఉదాహరణ. గతంలో హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇప్పుడు అమరావతిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.

చంద్రబాబు ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్న ఫోటోలు
పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, తిరిగి వెళ్ళే సమయంలో తన పాత అంబాసిడర్ కారును చూసుకుని, అందులో తన ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును ఇప్పుడు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఆయన తన పాత అంబాసిడర్ కారును పరిశీలించారు.

చంద్రబాబు చేసిన పోస్ట్ వైరల్
అందులో తన ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు నా పాత స్నేహితుడిని కలిశా.. ఒకప్పుడు ఈ కారులోనే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ప్రజలతో మమేకమయ్యాను. ఇవి కేవలం మనల్ని మైళ్ళ దూరం తీసుకెళ్ళిన వాహనాలు మాత్రమే కాదు, మనల్ని తీర్చిదిద్దిన అనేక జ్ఞాపకాల సాక్షులు కూడా ఆయన పేర్కొన్నారు. చివరగా మీ జీవిత పయనంలో అలాంటి జ్ఞాపకాల తోడు మీకుందా? అని ప్రజలను ప్రశ్నించారు. మొత్తంగా ఆయనకు ఇష్టమైన కారు విషయంలో చంద్రబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+