జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా .. రీజన్ ఇదేనా ?

ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం . అయితే అందుకు కారణం లేకపోలేదు . గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ స్వయంగా ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు వేరే కార్యక్రమాల్లో ఉండటంతో ఫోన్ లో మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తుంది .

This is the TDPs decision to stay away from the swearing in jagan

గతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గానీ, అమరావతి శంకుస్థాపనకు కానీ జగన్ రాలేదు .2014లో తాను సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా జగన్ అందుబాటులో లేకుండా పోయారు . జగన్ హాజరుకాలేకపోయినా కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్ళింది . ఇంటికి వెళ్ళిన వారిని అవమానించి మంత్రుల బృందాన్ని కలిసేందుకు జగన్ నిరాకరించారు.

ఈ పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావొద్దని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం . అంతేకాదు జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు తొందరపడొద్దని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది. మొత్తానికి జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరంగా వుండాలనే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+