పవన్ కళ్యాణ్ నుంచి బాలీవుడ్ వరకు.. ఆయుర్వేదంపై సెలబ్రిటీల ఆసక్తి!
నేడు ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం (Ayurveda for a Healthier Tomorrow) అనే థీమ్‌తో ఈ ఏడాది ఆయుర్వేద డేను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యాధులను నివారించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.
ప్రస్తుతం లైఫ్‌స్టైల్ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రివెంటివ్ హెల్త్‌కేర్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉంది. ఆయుర్వేదం, యోగా ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంచి ఇల్‌నెస్ టు వెల్‌నెస్ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించే విధానం మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పోషకాహారం, వెల్‌నెస్, శరీరం-మనస్సు మధ్య సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే సమగ్ర విధానం.

ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న రోగాలతో చాలామంది దృష్టి ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంపై పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి కూడా ఇటీవల కేరళలో ఆయుర్వేద వైద్య చికిత్స చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కేరళలో తన కుడి భుజం కోసం ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స చేయించుకున్నారు. 2026 జూలైలో ముంబైలో ఆయనకు కుడి భుజం లోని రొటేటర్ కఫ్ టియర్ సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది.
ఆ శస్త్ర చికిత్స తర్వాత పూర్తి స్థాయి రికవరీ కోసం వైద్యులు సూచనతో ఆయన కేరళలోని ఆయుర్వేద థెరపీని తీసుకున్నారు. డాక్టర్ సీతారాం ఆయుర్వేదిక్ రిట్రీట్ లో ఆయన వైద్య సేవలు పొందారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆయుర్వేదానికి, యునానీ వైద్యానికి, హోమియో పతి వైద్యానికి యోగాకు ఇటీవల కాలంలో చాలా మంది ప్రాధాన్యతను ఇచ్చి చికిత్స పొందుతున్నారు.
శిల్పా శెట్టి, కరీనా కపూర్, మలైకా అరోరా, సమంతా రుతు ప్రభు, దీపికా పదుకొనే, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, రజనీకాంత వంటి సెలబ్రిటీలు ఎందరూ ఆయుర్వేద వైద్యాన్ని, సహజ వైద్య విధానాలను స్వీకరిస్తున్నారు. యోగాతో ఆరోగ్యం అన్న విషయాన్ని అందరికీ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు ఆయుర్వేదాన్ని, నేచురోపతిని ఎక్కువగా నమ్ముతున్నారు.
ఆయుర్వేదంలో ఎన్నో నయం కానీ జబ్బులకు అద్భుతమైన వైద్యం ఉంది. ఆయుర్వేదం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, అలాగే రోగాల బారిన పడిన వ్యక్తికి చికిత్స చేయటం అనే రెండు లక్ష్యాలతో పని చేస్తుంది. అటువంటి ఆయుర్వేద వైద్య వ్యాప్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చెయ్యాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications
