హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్యాయత్నం: సినీ విలన్ బాబా అరెస్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమాల్లో విలన్ వేషాలు వేసే వ్యక్తి జీవితంలోనూ విలన్‌గా మారాడు. తప్పు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో కత్తితో దాడి చేశాడు. అతని చేతిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎనిమిది రోజుల పాటు గాలించి చివరకు సోమవారంనాడు అతన్ని పట్టుకున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాదులోని పహడీషరీఫ్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ బాబా (34), సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తుంటాడు. విక్రమార్కుడు, మాస్ తదితర సినిమాల్లో అతను విలన్‌గా నటించాడు. ఇతను గతంలో బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అతను షూటింగుల నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తుండడమే కాకుండా కొన్ని మార్లు ఫయాజ్ బంధువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు

అలాంటి సందర్బంలో ఓసారి ఫయాజ్, అతని బంధువులు కలిసి బాబాపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. దాంతో కోపంతో రగిలిపోయిన బాబా ఈ నెల 16వ తేదీన మాసబ్‌ట్యాంక్ చాచా నెహ్రూ పార్కు వద్ద ఫయాజ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఫయాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత బాబా పారిపోయాడు.

బాబాపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం పట్టుకున్నారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. బాబు నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాబాను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

మాస్ విలన్ ఇతనే..

మాస్ విలన్ ఇతనే..

విక్రమార్కుడు, మాస్ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన బాబా నిజ జీవితంలో విలన్ పాత్ర పోషించాడు. ఫయాజ్ అనే వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు.

మీడియా ముందుకు బాబా..

మీడియా ముందుకు బాబా..

ఎనిమిది రోజుల పాటు గాలించి పట్టుకున్న సినీ విలన్ బాబాను పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

బాబా కత్తి కట్టాడు...

బాబా కత్తి కట్టాడు...

తనతో ఇల్లు ఖాళీ చేయించిన ఫయాజ్‌పై బాబా కత్తి గట్టాడు. ఈ నెల 16వ తేదీన ఫయాజ్‌పై దాడి చేసి పారిపోయాడు.

నిజ జీవితంలోనూ విలన్ వేషాలే..

నిజ జీవితంలోనూ విలన్ వేషాలే..

బాబా సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ విలన్ వేషాలు వేశాడు. తన ప్రవర్తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు.

English summary

 Humayun Nagar police on Monday arrested Tollywood actor Abdul Rahman in an attempt to murder case. Rahman alias Baba, 34, is known for his villainous roles in several popular Telugu films like 'Vikramarkudu' and ''Mass'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X