TTD: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం.. వారికి టీటీడీ గుడ్ న్యూస్!!

ఏడుకొండల పైన కొలువైన దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తజనం పోటెత్తుతున్న విషయం తెలిసిందే. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగగా, మళ్లీ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పడుతున్నట్టుగా కనిపిస్తుంది.

తిరుమల శ్రీవారి సర్వ దర్శన సమయం ఇలా
స్వామివారిని సర్వదర్శనం చేసుకోవడానికి మొన్నటివరకు 24 గంటల సమయం పట్టిన పరిస్థితులు కూడా చూసాం. కానీ ప్రస్తుతం నేడు 12 గంటల సమయం దర్శనానికి పడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది.

TTD 12 hours time for Tirumala Srivari Sarvadarshan Good news for TTD

ప్రత్యేక దర్శనానికి సమయం ఇలా
మరోవైపు టైం స్లాట్ ఎస్ ఎస్ డి దర్శనం కోసం ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మీరు స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 83 వేల 740మంది దర్శించుకున్నారు. 35,462మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71కోట్లుగా ఉంది.

నిన్న స్వామివారికి దర్శనానికి 20 గంటల సమయం
ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు 20గంటల సమయం పట్టింది. 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మూడు గంటల సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి నేటివరకు ఆకాశగంగలోని శ్రీ అంజనా దేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌‌‌కు టీటీడీ శుభవార్త
కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌‌‌కు టీటీడీ శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు స్వామి వారి ఉచిత దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్​ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+