TTD: రాములోరి ఆలయాలలో బ్రహోత్సవాల జాతర.. అట్టహాసంగా వేడుకలకు టీటీడీ సన్నాహాలు!!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న రామాలయాలలో రాములోరి వార్షిక బ్రహ్మోత్సవాల జాతరను చేయడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను, వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను, తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టిటిడి తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.
చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 17వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు నిర్వహించనుంది. ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండగా, ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఏప్రిల్ 26వ తేదీన రాములోరి పట్టాభిషేకాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.

ఇదిలాఉంటే వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఏప్రిల్ 12వతేదీ నుండి ఏప్రిల్ 20వతేదీ వరకు నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 11వతేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండగా ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 8గంటల నుండి 10గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 20వ తేదీన ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.
కాగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఏప్రిల్ 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ నాలుగవ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించి ఆపై బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీన ధ్వజారోహణంతో తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ అన్ని ఉత్సవాలకు, రాములవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications