అంతా ఆ 2 నిమిషాల్లోనే: ఇలా వెళ్లి అలా వచ్చేద్దామన్నారు!, బోటు ప్రమాదం వెనుక..

Subscribe to Oneindia Telugu
  Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !

  విజయవాడ: కృష్ణా నది బోటు ప్రమాదానికి కారణాలు అనేకం. పవిత్ర సంగమాన్ని దర్శించుకోవాలనుకున్నవాళ్లంతా మృత్యు సంగమానికి చేరుకున్నట్టయింది. అనుమతులు లేకపోయినా బోటు నడపడం.. నడుపుతున్న డ్రైవర్ కు అనుభవం, నైపుణ్యం లేకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

  నిజానికి ప్రభుత్వ పర్యాటక సంస్థ బోట్లలోనే ప్రయాణించాల్సి ఉన్నా.. ఆ సమయానికి అవి అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవేటు బోట్లను ఎంచుకున్నారు. అదే వారు చేసిన ఘోర తప్పిదమైంది. మరోవైపు పర్యాటక సంస్థ అధికారులే వారికి ఆ ప్రైవేటు బోట్లను చూపించారన్న ఆరోపణ వినిపిస్తోంది.

   ఇలా వెళ్లి అలా వచ్చేద్దామని

  ఇలా వెళ్లి అలా వచ్చేద్దామని

  రివర్ బోటింగ్ సంస్థకు చెందిన బోటు ద్వారా సాయంత్రం 4.25గం.కు వారు భవానీ ద్వీపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అది మూసేసి ఉంది. దీంతో ఇక ఒంగోలుకు తిరుగుప్రయాణం కావాలని నిర్వాహకులు సూచించారు. అయితే.. సమీపంలోనే ఉన్న పవిత్ర సంగమాన్ని దర్శించి వద్దామని కొంతమంది పట్టుబట్టారు. 'ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం' అని పట్టుబపట్టడంతో.. డ్రైవర్ అటువైపుగా తీసుకెళ్లాడు.

   ఒండ్రమట్టి మేటలు

  ఒండ్రమట్టి మేటలు

  పవిత్ర సంగమం అనేది పట్టిసీమ నుంచి ఎత్తిపోసే గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే చోటు. ఇక్కడినుంచి కాస్త ముందుకెళ్తే హారతులు ఇచ్చే ప్రదేశం ఉంటుంది. పోలవరం కుడి కాల్వ నుంచి ఇక్కడ నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. గత నాలుగు నెలలుగా ఇక్కడ గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా వదులుతున్నారు. ఆ ప్రాంతంలో ఒండ్రమట్టి మేటలు వేసి ఉండటంతో కొన్ని ఇసుక దిబ్బలు ఏర్పడి ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ కు అంతగా నైపుణ్యం లేకపోవడంతో వాటిని గుర్తించలేకపోయాడు.

  ఆ ప్రాంతం ఇలా ఉంటుంది

  ఆ ప్రాంతం ఇలా ఉంటుంది

  కృష్ణా నది ప్రవాహాన్ని చీల్చుకుంటూ గోదావరి జలాలు కలిసే ప్రాంతం కావడంతో.. ఆ ప్రదేశమంతా నీటి సుడులతో ఒకవిధమైన అలజడి కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితులపై డ్రైవర్ కు అవగాహన లేదు. తొలిసారి ఆ దిశగా బోటు నడుపుతుండటంతో అసలేం జరుగుతుందో గుర్తించలేకపోయాడు.

  మేట వేసిన ఒండ్రు మట్టిని బోటు కింది భాగం తాకి ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఏదో జరుగుతుందనే భయంతో డ్రైవర్ వేగాన్ని మరింత పెంచాడు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి.. గోదావరి జలాలు బోటును ఢీకొట్టాయి. దీంతో బోటు తలకిందులుగా పడటం.. పర్యాటకులంతా నీళ్లలో పడిపోవడం జరిగిపోయాయి.

  ఆ 2ని.ల్లోనే పెనువిషాదం

  ఆ 2ని.ల్లోనే పెనువిషాదం

  మరో రెండు నిమిషాలైతే వాళ్లంతా పవిత్ర సంగమం వద్దకు చేరుకుంటారనగా సరిగ్గా సాయంత్రం 5.24గం.కు ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నించగా.. ఈతరాని వారు నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తూ కొట్టుకుపోయారు.

  కృష్ణమ్మ అలలపై బోటు అలా.. అలా.. కదులుతుంటే.. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి వారు మురిసిపోయారు. కానీ రెండు నిమిషాల్లోనే పరిస్థితి తలకిందులైంది. గోదావరి జలాలు కృష్ణానదిని చీల్చుకుంటూ రావడం డ్రైవర్ గుర్తించలేకపోవడం.. ఇసుక మేటను ఢీకొట్టడంతో పెనువిషాదం చోటు చేసుకుంది. ఆ రెండు నిమిషాలు ప్రశాంతంగా గడిచి ఉంటే.. వారంత హాయిగా ఒంగోలు బయలుదేరేవారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Two short minutes changed everything, that can lead to tragedy. Atleast 19people are died till now

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి