వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరే హంతకులు..? తుది దశకు వివేకా హత్య కేసు విచారణ

|
Google Oneindia TeluguNews

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హత్య కేసుకు సంబంధించి సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. మరో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో సునీల్‌ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ... నిన్న ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డి...వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి సోదరుడు. రోజంతా ఉమాశంకర్‌రెడ్డిని విచారించిన అధికారులు సాయంత్రం అరెస్ట్‌ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 23వరకు రిమాండ్ విధించడంతో...పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు. వివేకా హత్య కేసులో సునీల్, ఉమా శంకర్ పాత్ర ఉందని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

కీలక అంశాలు

కీలక అంశాలు

ఉమా శంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పలు కీలక అంశాలను సీబీఐ పొందుపర్చింది.. ఉమాశంకర్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ అధికారులు తెలిపారు. హత్యకేసులో సునీల్, ఉమాశంకర్‌ రెడ్డి కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. హత్యకేసులో ఉమాశంకర్‌ పాత్ర ఉందని విచారణ సమయంలో సునీల్ చెప్పినట్లు, అలాగే వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఉమాశంకర్‌ పాత్ర ఉన్నట్లు ప్రస్తావించారు.

కుక్క హత్య

కుక్క హత్య

వివేకా హత్యకు ముందు ఆయన ఇంట్లో కుక్కను చంపారని రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. సునీల్, ఉమాశంకర్‌ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపారని, వివేకాను హత్యచేశాక ఉమాశంకర్ బైక్‌లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని, ఆ గొడ్డలితో పాటు బైక్‌ను సీజ్‌ చేసినట్లు సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకా హత్యకేసులో గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక తెప్పించిన సీబీఐ.. గతనెల 11న ఉమాశంకర్‌ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరి కొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉందని... ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపింది

సునీల్, ఉమా

సునీల్, ఉమా

ఉమా శంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. వారు ఇచ్చిన వివరాల మేరకు.. వివేకా హత్య కేసులో సునిల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్ర పై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హత్య కేసులో వీరిద్దరి కుట్ర కోణం ఉందనే విషయం తమ విచారణలో వెల్లడైందన్నారు. ఉమాశంకర్ రెడ్డి పాత్రపై సునిల్ యాదవ్ విచారణలో తేలినట్లు వివరించారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందనే విషయం తేలినట్లు ఉంది.

బైకు, గొడ్డలి

బైకు, గొడ్డలి

ఉమాశంకర్ రెడ్డి పల్సర్ బైక్‌లో గొడ్డలి పెట్టుకొని పారిపోయారు. బైకు, గొడ్డలిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో ఫోరెన్సిక్ నివేదిక కూడా తెప్పించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అలాగే గత నెల 11న ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరికొందరు నిందితులు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

హత్యతో కలకలం

హత్యతో కలకలం

2019 మార్చి నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ సీజ్ చేసినట్లు సమాచారం. తర్వాత వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో చెబితే వారికి బహుమతి ఇస్తామని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీబీఐ వెల్లడించడం చర్చనీయాంశమైంది.

కడప జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. కడపలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ యాదవ్‌లతోపాటు మరికొంతమందిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended Video

చరిత్ర సృష్టించిన Avani Lekhara.. మరో పతకం కైవసం..! || Oneindia Telugu
విచారణ స్వీడప్

విచారణ స్వీడప్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని ప్రశ్నిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు పులివెందుల సీఐగా పని చేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యను విచారణకు పిలిచారు. మరో విలేఖరిని కూడా విచారణకు పిలిచారు. వివేకా హత్య జరిగిన రోజు ముందుగా గుండెపోటుగా ప్రచారం చేసింది ఎవరనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డే వివేకా హత్య విషయాన్ని పులివెందుల సీఐకు ఫోన్ చేసి చెప్పినట్లు వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వీరందరినీ పిలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ తుది దశకు చేరినట్టే అనిపిస్తోంది. మరికొద్దీరోజుల్లో ఎంక్వైరీ ముగియనుంది. హత్య కేసులో సునీల్, ఉమా నిందితులు అని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి వారికి ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. విచారణ పూర్తి చేసి.. ఛార్జీ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది.

English summary
two persons ys viveka murder case culprits cbi sources said. uma shanker reddy and sunil yadav is may be culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X