షాకిచ్చిన యూజీసీ, వర్సిటీ హోదా కోల్పోయిన 123 యూనివర్సిటీలు, విట్, గీతం, ఎస్.ఆర్.ఎం. కూడా!
అమరావతి: ఇంజనీరింగ్ విద్య నాణ్యత విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు పలు అంశాలను ప్రస్తావిస్తూ, యూజీసీకి పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజీసీ దేశ వ్యాప్తంగా 123 విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదాను రద్దు చేసింది.
అయితే, ఆ విద్యా సంస్థలన్నీ యథావిధిగా పనిచేయవచ్చు కానీ, హోదా కోల్పోయిన విద్యా సంస్థల పేరు చివర యూనివర్సిటీ అన్న పదం ఉండకూడదు. ఆయా విద్యా సంస్థలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో పనిచేయాలి.

అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా నడపాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ దూరవిద్య విధానం ద్వారా 4 విద్యా సంస్థలు జారీ చేసిన ఇంజనీరింగ్ పట్టాలు రద్దు అయ్యాయి.
వర్సీటీ హోదా కోల్పోయిన పలు విద్యా సంస్థలలో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), విశాఖపట్నంలోని గీతం, ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరులోని
విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ రీసెర్చ్ కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications