శుక్రవారం పర్ఫ్యూమ్, రోజూ 30ఎంఎల్ స్కాచ్ తాగితే.. వేణుస్వామి వీడియో వైరల్!

వేణు స్వామి.. సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పి ఎప్పుడు సంచలనాల్లో నిలిచే ఆస్ట్రాలజర్. ఇక వేణు స్వామి జ్యోతిష్యం ఎవరు అంచనా వేయలేని విధంగా ఉంటుంది. గతంలో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణు స్వామి జాతకం నిజమైంది. ఆ తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ శుభమా అని వివాహం చేసుకుంటున్న వేళ, వారిద్దరు ఎంతో కాలం కలిసి ఉండరని, నాగచైతన్యకు సంతానయోగం లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంచలనాలకు కేరాఫ్ వేణు స్వామి
ఆ తర్వాత పలు పోలీస్ స్టేషన్లలో వేణు స్వామి పైన ఫిర్యాదులు చేయడం, కేసు నమోదు కావడం వంటి ఘటనలు జరిగిపోయాయి. ఇది మాత్రమే కాదు రాజకీయ జ్యోతిష్యాలు కూడా చెప్పిన వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చంద్రబాబు ఓడిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్లీ తను ఎన్నడు సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని వీడియో ఒకటి రిలీజ్ చేశారు.

Use perfume on Friday and drink 30ml of scotch every day Venuswamy video viral

సోషల్ మీడియాలో వేణు స్వామి వీడియో వైరల్
ఇక అప్పటితో వేణు స్వామి నోటికి తాళం పడుతుందని అందరూ భావించిన మళ్లీ అదంతా మరిచిపోయిన వేణు స్వామి సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూనే ఉన్నారు. తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వేణుస్వామికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ఏం చేయాలో చెప్పిన వేణు స్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

శుక్రుడు నీచస్థితిలో ఉంటే ఏం చెయ్యాలో చెప్పిన వేణు స్వామి
ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన యాంకర్ ఆశ్చర్యపోయే విధంగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ప్రతి శుక్రవారం పర్ఫ్యూమ్ కొట్టుకోవాలని వేణు స్వామి చెప్పారు. అంతేకాదు ప్రతిరోజు 30 ఎంఎల్ స్కాచ్ తాగాలని వేణుస్వామి వెల్లడించారు.అయితే అది ఉద్యమం చేసినట్టు తాగొద్దని అన్నారు.

మూడు నెలలు స్కాచ్ తాగాలని సలహా
శుక్రుడు లగ్జరీలకు అధిపతి కాబట్టి ఒక మూడు నెలలపాటు ప్రతిరోజు ఇలా చేస్తే ఆ తర్వాత రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయని వేణు స్వామి చెప్పిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరి జ్యోతిష్యులు ఒకదారైతే, ఈయనది ఇంకో దారి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

వేణు స్వామిపై పేలుతున్న సెటైర్లు
ప్రతిరోజు స్కాచ్ ఎక్కడి నుంచి తెచ్చుకు తాగాలి చెప్పండి అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉండగా, శుక్రుడు నీచ స్థితిలో ఉంటే పూజలు పునస్కారాలు వంటివి పరిహారాలుగా ఉంటాయి కానీ ఈ పర్ఫ్యూమ్ లు కొట్టుకోవడం, స్కాచ్ తాగడం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే వేణు స్వామి గురించి తెలిసిన వాళ్ళు ఆయనతో అట్లాగే ఉంటది అంటూ నవ్వుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+