రోజా నాకు పోటీనా?: తేల్చేసిన వాణీ విశ్వనాథ్, రేపే బాబు సమక్షంలో టీడీపీలోకి?

Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ సినీ నటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే తాను టీడీపీలో చేరుతున్నట్లు వాణీవిశ్వనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే టీడీపీ చోరబోతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఏపీలో పరిపాలన బాగుందని కితాబిచ్చారు.

YS Jagan Padayatra : మోకాళ్ల యాత్ర చేస్తే ఇంకా బాగుంటుంది | Oneindia Telugu

రోడ్లపైనే తిరుగుతుంటా: వాణీ విశ్వనాథ్‌కు వర్మ కౌంటర్, 'రోజా అంటేనే పుకార్లు'

ముహూర్తం ఖరారు..

ముహూర్తం ఖరారు..

మంగళవారం టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కలుస్తానని వాణీ విశ్వనాథ్ చెప్పారు. చంద్రబాబును కలిసిన సమయంలోనే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. అంతేగాక, రాజకీయాలలో పూర్తి స్తాయిలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని వాణీ విశ్వనాథ్ తెలపడం గమనార్హం.

రోజాపైనే పోటీ..

రోజాపైనే పోటీ..

పార్టీ ఆదేశిస్తే వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై పోటీకి సిద్దమని ఆమె ప్రకటించారు. తనకు రోజా పోటీ అనుకోవడం లేదని వాణీవిశ్వానాథ్ చెప్పారు. గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన వాణీ విశ్వనాథ్ తనకు ఏపీ అన్నా.. చంద్రబాబు న్యాయకత్వం అన్నా ఇష్టమని చెప్పారు.

బాబుకు ప్రశంసలు.. టీడీపీ ఫైర్ బ్రాండ్‌ అవుతారా?

బాబుకు ప్రశంసలు.. టీడీపీ ఫైర్ బ్రాండ్‌ అవుతారా?

చంద్రబాబు గొప్ప నాయకుడని వాణీ విశ్వనాథ్ కొనియాడారు. తాను మళయాళీని అయినప్పటికీ తెలుగు ప్రజలు అంటే ఇష్టమని పేర్కొంది. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్న రోజాకు చెక్ పెట్టడానికి ధీటైన నేత కోసం టీడీపీ మొదటి నుంచి వెతుకుతోందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సందర్భంలో వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరుతానని టీడీపీకి కలిసివచ్చే అంశమేనని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.

రోజాను ఓడించేస్తారా?

రోజాను ఓడించేస్తారా?


గతంలో కూడా రోజాపై పోటీగా టీడీపీ నుంచి వాణివిశ్వనాథ్ దింపాలని టీడీపీ భావించినట్లు తెలిసింది. అయితే, ఇప్పడు వాణీ విశ్వనాథే రోజాపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. దీంతో వాణీ విశ్వనాథ్ ను టీడీపీలో చేర్చుకుని రోజాపై నిలబెట్టేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గత కొంత కాలంగా నగరి ప్రజలకు అందుబాటులో ఉంటున్న రోజాకు వాణీ విశ్వనాథ్ పోటీ ఇవ్వగలరా?, ఓడించగలరా? అనేది వేచిచూడాల్సిందే.

నగరిలోనే మకాం: నిర్మాణంలో రోజా కొత్త ఇల్లు ఇదే(పిక్చర్స్)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine Actress Vani Viswanath likely to join TDP tomorrow on the presence of Andhra Pradesh CM and TDP chief Chandrababu Naidu.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి