బూతుల మంత్రి అంటూ కొడాలి నానీపై వర్ల రామయ్య ఫైర్ ... జగన్ కు వర్ల డిమాండ్స్

ఏపీలో టిడిపి,వైసిపి నేతల మధ్య మాటల దాడి కొనసాగుతుంది.మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబును,లోకేష్ ను,ముఖ్య నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఇక నాని వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి కొడాలి నాని పై ఏపీ టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బూతుల మంత్రి కొడాలి నాని అంటూ వ్యాఖ్యానించిన వర్ల రామయ్య. మంత్రి బూతులు మాట్లాడినంత మాత్రాన చట్టాలు మారతాయా ? అంటూ ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కొడాలి నాని చదువు లేకపోవడం వల్లనే ఆ విధంగా మాట్లాడాను అని ఒప్పుకోవాలని వర్ల రామయ్య పేర్కొన్నారు .

Varla Ramaiah Fires on Kodali Nani as Minister of abuses and demands to Jagan

తిరుమల విషయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా పరుషంగా మాట్లాడిన కొడాలి నాని పై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు . కొడాలి నాని నోటికి తాళం వెయ్యాలని ఆయన సీఎం జగన్ కు సూచించారు. ఇక తిరుమల రూల్స్ అతిక్రమించి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో కి వెళ్ళిన సీఎంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని టీటీడీని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రవర్తిస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. ఇక ఇదే క్రమంలో భవిష్యత్తులో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే తిరుమల ఆలయంలోకి వెళ్లాలని, ఇక అదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+