విడదల రజినీకి బిగుస్తున్న ఉచ్చు.. వెలుగులోకి సంచలన విషయాలు!
శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నుండి అక్రమ వసూళ్ళకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసిపి నాయకురాలు విడదల రజనీపై సిఐడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విడదల రజినీ మెడకు ఉచ్చు బిగుస్తుంది అన్న సంకేతాలను ఇస్తోంది.
జాషువా లిఖిత పూర్వక సమాధానం
ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను నిందితుడిగా చేర్చడంతో తాజాగా ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం కీలకంగా మారింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి జాషువా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అందులో ఆయన విడదల రజిని గురించి అనేక కీలక విషయాలను వెల్లడించారు.

శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై విడదల రజినీ ఫిర్యాదు
2019 జూన్ 24వ తేదీ నుండి 2021 ఆగస్టు 24వ తేదీ వరకు తాను రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా గుంటూరుకు పని చేశానని జాషువా పేర్కొన్నారు. అప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని తమ కార్యాలయానికి వచ్చి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
రజిని ఫిర్యాదుతో ప్రాధమికంగా రహస్య విచారణ
శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని, దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని విడదల రజిని కోరారని ఆయన తెలిపారు. విడదల రజిని చేసిన ఆరోపణల పైన ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తాను ప్రాథమికంగా రహస్య విచారణ చేయించారని పేర్కొన్నారు.
రజినీ ఫిర్యాదు పత్రాలు కార్యాలయం నుండి మాయం
అయితే స్టోన్ క్రషర్ యాజమాన్యం నాటి టిడిపి నేతకు చెందిన సానుభూతిపరులదని వారితో విడదల రజనీకి రాజకీయ శత్రుత్వం ఉండడం వల్ల ఆమె తమ పైన ఒత్తిడి తెచ్చారన్నారు. నాడు రజిని ఫిర్యాదు మేరకు తాము తనిఖీలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే విడదల రజని తమకు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
విడదల రజిని మెడకు బిగుస్తున్న ఉచ్చు
ఇక విజిలెన్స్ ఫైల్స్ కూడా ట్యాంపరింగ్ చేసి కొన్నింటిని తొలగించినట్టుగా జాషువా తెలిపారు. ఇక తాజాగా జాషువా ఇచ్చిన లిఖితపూర్వకమైన స్టేట్మెంట్ తో విడదల రజిని మెడకు ఉచ్చు బిగిసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications