ఆయన సొంత కథలో ఆయనే హీరో.. పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి సంచలనం
తనదైన విలక్షణ నటనతో తెలుగు తమిళ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుని సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి తాజాగా హైదరాబాద్లో మహారాజా సినిమా ప్రమోషన్స్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయ్ సేతుపతి పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
పవన్ కళ్యాణ్ విజయంతో సినీ సెలబ్రిటీల ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అంటూ పలువురు పవన్ కళ్యాణ్ కు కితాబిచ్చారు. దళపతి విజయ్ వంటి తమిళ సినీ ఇండస్ట్రీ స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
పవ

అయితే లేటుగా అయినా లేటెస్ట్ గా స్పందించిన విజయ్ సేతుపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడే తత్వాన్ని చాలా గౌరవిస్తానని, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని, కానీ ఆయన తొడ కొట్టినప్పుడు రియల్ లైఫ్ లో ఎంత మాస్ నో అర్థమైంది అంటూ పేర్కొన్నారు.
ఆయన సొంత కథలో ఆయనే హీరో
ఎవరి కథలోనో ఆయన హీరో కాదని, ఆయన సొంత కథలో ఆయనే హీరో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి నాకు ఏ విషయం అంతగా తెలియదు అని పేర్కొన్న విజయ్ సేతుపతి ఇంగ్లీష్ లో ఉన్న కొందరు తెలుగు వాళ్ళ స్టేటస్ లో పెట్టుకున్న వీడియోలను చూసి అడిగితే వాళ్ళు చాలా విషయాలు చెప్పారన్నారు.
సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై విజయ్ సేతుపతి
అంతే కాదు సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొంటారో వారు చాలా స్ట్రాంగ్ అని అర్థం అంటూ పేర్కొన్నారు.ప్రతిరోజు ఫోన్ మనతోనే ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్లు నా చుట్టూ ఏదో ఒక చెడ్డ విషయం పుకార్లు, ట్రోలింగ్స్ సృష్టిస్తూ ఉంటారు. మనం పట్టించుకోకున్నా మన చుట్టూ ఉన్నవారు వాటిని మనకు చూపిస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ ఎన్నో ఎదుర్కొన్నారు
అలాంటి సమయంలోనే మానసిక సైన్యంతో ఉండాలని.. ఇలా ఎన్నో విషయాలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు కాబట్టి ఫైనల్ గా ఆయన ఏంటో చూపించారని విజయ్ సేతుపతి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications