కోనసీమ బ్లోఅవుట్..! కేంద్రం ముందు సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ చేపడుతున్న చమురు తవ్వకాల్లో గ్యాస్ లీక్ అయి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిన్న ఉదయం ప్రారంభమైన మంటలు ఇవాళ్టికి కూడా పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని సైతం అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీ బ్లోఅవుట్ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ భారీగా లీక్ కావడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో స్పందించారు. ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్ లీక్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించడం, కోనసీమలో సమీప గ్రామాల ప్రజల్ని ఇళ్లు ఖాళీ చేయించాల్సిన రావడం, చివరికి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించినా ఇలాంటి ఘటనలు స్థానికుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తాయని సాయిరెడ్డి తెలిపారు.

Highlighting the gas leak at an ONGC well that led to a fire and the evacuation of nearby villages at Konaseema, AP. While it is a relief that there were no casualties, such incidents severely affect the livelihood of locals. I urge Hon’ble Petroleum Minister @HardeepSPuri ji to… pic.twitter.com/lEj1jDAY5T
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 6, 2026
కాబట్టి ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, జవాబుదారీతనం నిర్ధారించాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజయసాయిరెడ్డి కోరారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఇవాళ కూడా గ్యాస్ లీక్ సైట్ లో మంటలు అర్పేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా సాయంత్రానికి కూడా పూర్తి స్ధాయిలో మంటలు అదుపులోకి రాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో అప్ చేస్తున్నా పరిస్ధితులు మాత్రం సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications