ప్రియమైన చంద్రం అన్నయ్యకు.. సిగ్గుపడొద్దంటూ విజయసాయిరెడ్డి మరో పంచ్..
ఏపీలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టే వ్యంగ్య ట్వీట్లు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. ఇందులో సాయిరెడ్డి విసిరే పంచ్ లు టీడీపీతో పాటు ఆయన సొంత పార్టీ వైసీపీలోనూ చర్చకు దారి తీస్తుంటాయి. ఇదే క్రమంలో మరోసారి సాయిరెడ్డి వరుస ట్వీట్లతో పంచ్ లు విసురుతున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు కర్నూలు టూర్ లో చోటు చేసుకున్న పరిణామాలపై రెండు రోజులుగా విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు పెడుతున్నారు. కర్నూల్లో చంద్రబాబు చేసిన లాస్ట్ ఛాన్స్ వ్యాఖ్యలపై ఇప్పటికే పంచ్ లు విసురుతున్న సాయిరెడ్డి.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా లాయర్లు, వైసీపీ కార్యకర్తలు చేసిన నిరసనల్ని వాడుకుంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో చంద్రబాబు రాజకీయ ప్రస్ధానాన్ని సైతం గుర్తుచేస్తూ చంద్రబాబును సాయిరెడ్డి దెప్పిపొడిచారు.

"ప్రియమైన చంద్రం అన్నయ్యా ! మొదట్లోనే చంద్రగిరి నిన్ను ఛీపొమ్మంది. ఆ తరవాత హైదరాబాద్ తన్ని తరిమింది. ఇంతకుముందే ఉత్తరాంధ్ర ఉమ్మేసింది. ఇప్పుడు రాయలసీమ కూడా నిన్న గో బ్యాక్ అంటోంది ! అయినా సిగ్గుపడకు అన్నయ్యా ! ఎల్లో కుల మీడియాలో నీకు కావాల్సినంత ప్లేస్ ఉంది" అంటూ విజయసాయిరెడ్డి వరుస పంచ్ లతో రెచ్చిపోయారు. తద్వారా చంద్రబాబుకు అన్నిచోట్లా ఛీత్కారాలు తప్పడం లేదనే విషయాన్ని గుర్తుచేసారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications